ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ టెస్లా (Tesla Plant) భారతదేశంలో మానుఫాక్చరింగ్ ప్లాంట్ (Manufacturing Plant)స్థాపించనుందన్న ఊహాగానాలకు చెక్ పడినట్లైంది. టెస్లా సంస్థ భారత్లో ఉత్పత్తి కేంద్రం పెట్టే యోచనలో లేదని, ఇప్పటివరకు అలాంటి సంప్రదింపులు జరగలేదని కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామి (Union Minister H.D. Kumaraswamy) స్పష్టం చేశారు. ఇటీవల టెస్లా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వారు కేవలం టెస్లా షోరూమ్స్ ఏర్పాటుపై మాత్రమే ఆసక్తి చూపారని ఆయన వెల్లడించారు.
IPL 2025 Final: ఐపీఎల్ 2025.. ఫైనల్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఇదే!
టెస్లా సంస్థ భారత్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, తమ వాహనాలను భారతీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు ఉన్న దిగుమతి టారిఫ్లు ప్రధాన అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానంగా ప్రవేశపెట్టిన “అమెరికా ఫస్ట్” ప్రాసెస్, భారీ దిగుమతి పన్నులు, ద్విపాక్షిక వర్తక ఒప్పందాల లోపం వంటి అంశాలు టెస్లా భారత్ ప్రవేశాన్ని దెబ్బతీసే అంశాలుగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు
అయితే, టెస్లా వాణిజ్యపరమైన ఉనికిని భారత్‌లో కొనసాగించేందుకు ప్రాథమికంగా షోరూమ్స్ ప్రారంభించేందుకు యోచిస్తోందని సమాచారం. దీని ద్వారా మార్కెట్ ప్రతిస్పందనను అంచనా వేసిన తర్వాతే సంస్థ తదుపరి వ్యూహాలు రూపొందించవచ్చని భావిస్తున్నారు. మొత్తంగా, టెస్లా మానుఫాక్చరింగ్ ప్లాంట్‌ను భారత్‌లో ఏర్పాటు చేస్తుందన్న అంచనాలకు ప్రస్తుతం విశ్రాంతి దొరికినట్టే.