Site icon HashtagU Telugu

J&K : టూరిస్టులపై ఉగ్రవాదుల కాల్పులు

Terrorists Open Fire On Tou

Terrorists Open Fire On Tou

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు (Terrorists ) రెచ్చిపోయారు. దక్షిణ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ఉన్న టూరిస్టుల(Tourists)పై గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒక టూరిస్టు అక్కడికక్కడే మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు, భద్రతా సిబ్బంది సహాయంతో బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Police Complaint : హెలికాప్టర్ ఎగరడం లేదని పోలీసులకు బుడ్డోడు పిర్యాదు..అసలు ట్విస్ట్ ఇదే !

కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆర్మీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని ముట్టడి చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా మూసివేసి, దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. ఈ కాల్పులు ఎవరుచేసినవి? వారి ఉద్దేశం ఏమిటన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

పహల్గాం వంటి పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి దాడులు జరగడం భద్రతా సిబ్బందికి సవాలుగా మారింది. పర్యాటకులపై జరిగిన ఈ దాడి తర్వాత రాష్ట్రం లో భద్రతా పరంగా మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు అధికారికంగా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.