Site icon HashtagU Telugu

Terrorists Attack : ఎన్నికల వేళ రెచ్చిపోయిన ఉగ్రవాదులు..ఎయిర్ ఫోర్స్ వాహనంపై దాడి

Terrorists Attack Vehicles

Terrorists Attack Vehicles

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ..జమ్మూ లో ఉగ్రవాదులు (Terrorists Attack) రెచ్చిపోయారు.ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందికి సంబంధించిన వాహనాల కాన్వాయ్ వెళ్తుండగా వాటిపై దాడి చేసారు. ఈ దాడిలో ఐదుగురు సైనికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. పూంచ్ జిల్లాలోని సూరన్‌కోట్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. దాడి జరిగిన వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదులపైకి 30 రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆర్మీ వాహనంపై కాల్పులు జరిగిన తర్వాత మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టడానికి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. పూంచ్‌లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనిపించారని స్థానికులు తెలిపారు. గతేడాది పూంచ్‌లో భారత ఆర్మీ జవాన్లపై పలుచోట్ల ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఏడాది ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఈ మేరకు శనివారం ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఐదుగురు వైమానిక దళ సిబ్బంది గాయపడ్డారని పోలీస్ అధికారులు తెలిపారు.

అనంత్‌నాగ్-రాజౌరీ-పూంచ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన పూంచ్, పోలింగ్‌ను EC రీషెడ్యూల్ చేసింది. ఇక్కడ మే 25న ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలపై సమాచారం అందుకున్న జమ్మూ కాశ్మీర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అంతకుముందు సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సంభావ్య చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు అడ్డుకోవడంతో సాంబా సెక్టార్‌లోని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) సిబ్బందిని హై అలర్ట్ చేయడం జరిగింది.

Read Also : Panipuri Water : పానీపూరి వాటర్ టేస్టీగా ఉన్నాయని జుర్రేస్తున్నారా ? మీకో షాకింగ్ న్యూస్..