Intelligence sources : దేశంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు దిగొచ్చని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. ముంబయి ఉగ్రదాడి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు తీసుకువచ్చి విచారిస్తోన్న తరుణంలో ఈ అలర్ట్ రావడం గమనార్హం. డ్రోన్, ఐఈడీతో దాడులు జరగవచ్చని వెల్లడించాయి. నదీమార్గాల్లో తీవ్రవాదులు చొరబడవచ్చని చెప్పాయి. ఈ క్రమంలో రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి.
ఈ మేరకు శనివారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదం ఉందని, తీర ప్రాంతాల్లో బందోబస్తు పెంచాలని సూచించింది. కాగా పాకిస్థాన్ తీవ్రవాదులు 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారానే ముంబయిలోకి ప్రవేశించి సీఎస్ఎంటీ, ఒబెరాయి ట్రైడెంట్, తాజ్ హోటల్ లో మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులోనే తహవూర్ రాణాను భారత్ ప్రస్తుతం విచారిస్తోంది. ఈ విచారణలో అతడు చెప్పబోయే సమచారం కీలకం కాబోతున్నది. ముఖ్యమంగా పాకిస్థాన్ కుట్రలు బయహిర్గతం అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
2008 నవంబర్ 29 వరకు ఈ మారణహోమం కొనసాగింది. ఈ ఉగ్రదాడుల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులతో పోరాడుతూ అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్‌లు అమరులయ్యారు. కాగా రాణా పాకిస్థాన్ మూలాలున్న కెనడా జాతీయుడు. డేవిడ్ హెడ్లీతోపాటు 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు.
Read Also: Gujarat Titans: గుజరాత్ టైటాన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం!