Operation Kagar : పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ప్రభావం ‘ఆపరేషన్ కగార్’పై పడింది. ‘ఆపరేషన్ కగార్’ అనేది మావోయిస్టుల ఏరివేత కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్. భారత్-పాక్ యుద్ధం త్వరలోనే మరింత తీవ్రరూపు దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలను టార్గెట్‌గా చేసుకొని పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లు సంధిస్తోంది. పాక్‌ను భారత్ బలంగా ప్రతిఘటిస్తోంది. పాక్ దాడుల్లో ప్రధానంగా జమ్మూకశ్మీరు, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్‌లలోని సరిహద్దు ప్రాంతాలు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో సైన్యం మోహరింపులను భారత్ పెంచనుంది.
Also Read :Indian Airports Shut: భారత్ – పాక్ టెన్షన్స్.. 32 ఎయిర్‌పోర్టుల మూసివేత
సీఆర్‌పీఎఫ్ కీలక నిర్ణయం
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ రిజర్వుడ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకోవాలని సీఆర్పీఎఫ్ జవాన్లకు ఆదేశాలు జారీ చేసింది. కర్రెగుట్టల్లో కూంబింగ్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు అంతా ఆదివారం ఉదయంలోగా సీఆర్‌పీఎఫ్ హెడ్ క్వార్టర్‌లో రిపోర్టు చేయాలని స్పష్టం చేసింది. అందుకే ఇప్పుడు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి సీఆర్‌పీఎఫ్ సిబ్బంది హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి వెళ్తున్నట్లు సమాచారం. దీంతో ఆపరేషన్ కగార్‌కు తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లయింది. అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పరిధిలో ఆపరేష్ కగార్(Operation Kagar) కంటిన్యూ కానుంది.
Also Read :Red Alert : పంజాబ్‌పైకి భారీగా పాక్ డ్రోన్లు.. అమృత్‌సర్, భటిండాలలో రెడ్ అలర్ట్
టార్గెట్ 2026 మార్చి..
2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర సర్కారు ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. గతేడాది ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ఇప్పటివరకు 120 మందికిపైగానే మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అడవుల్లో పెద్దసంఖ్యలో మావోయిస్టుల టీమ్‌లు ఉన్నాయి. ఆపరేషన్ కగార్‌లో ఈ రాష్ట్రాల్లోని అడవుల్లో ఉన్న మావోయిస్టులు కకావికలం అయ్యారు.