Site icon HashtagU Telugu

Tejashwi Yadav : రాహుల్ మాదిరే తేజస్వీ ఓడిపోతారు – PK సంచలన వ్యాఖ్యలు

Prashant Kishor Tejashwi Ya

Prashant Kishor Tejashwi Ya

బీహార్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారిన వ్యక్తి జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (PK). ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ.. ఆర్జేడీ (RJD) నేత తేజస్వీ యాదవ్ రాఘోపుర్ నియోజకవర్గంలో ఈసారి ఓటమి చవిచూడవచ్చని అన్నారు. ఇది గతంలో రాహుల్ గాంధీ అమేఠిలో ఎదుర్కొన్న పరాజయంలా ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. ఆయన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లోని కుటుంబ ఆధిపత్యం, వర్గ ప్రాధాన్యతలపై మళ్లీ చర్చను తెరపైకి తెచ్చాయి.

‎Food: ఖాళీ కడుపుతో పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు!

ప్రశాంత్ కిశోర్ విమర్శిస్తూ, “రాఘోపుర్ ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి ఓటు వేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ కనీస సౌకర్యాలు, అభివృద్ధి కనిపించదు” అని అన్నారు. తేజస్వీ యాదవ్ కుటుంబం ఈ ప్రాంతం నుంచి ఎన్నో సార్లు గెలిచినా, పాఠశాలలు, ఆసుపత్రులు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఇంకా దురస్థితిలో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు ఈ కుటుంబ ఆధిపత్య రాజకీయాలపై విసుగు వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. బీహార్ అభివృద్ధికి అవసరమైనది కుటుంబ రాజకీయం కాకుండా సామాజిక మార్పు అని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల్లో తన పోటీపై ప్రశ్నించగా, ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ, “నేను పోటీ చేయాలా లేదా అన్నది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది” అని అన్నారు. ప్రస్తుతం తన దృష్టి రాష్ట్రవ్యాప్తంగా జన్ సురాజ్ ఉద్యమాన్ని బలోపేతం చేయడంపైనే ఉందన్నారు. బీహార్‌లో నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని నిర్మించడమే తన లక్ష్యమని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు తేజస్వీ యాదవ్ శిబిరంలో ఆందోళన కలిగించగా, రాజకీయ విశ్లేషకులు దీన్ని బీహార్‌లో కొత్త రాజకీయ సమీకరణాలకు సంకేతంగా చూస్తున్నారు.

Exit mobile version