Teacher Changes Gender: ప్రేయసి కోసం లింగమార్పిడి..!

ప్రేమకోసం ఏదైనా చేసే వాళ్ళను చూశాం. కానీ

  • Written By:
  • Updated On - November 9, 2022 / 12:02 AM IST

ప్రేమ ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పలేం.. ఒక అబ్బాయికి ఒక అమ్మాయిపై పుట్టొచ్చు.. ఒక అమ్మాయికి మరో అబ్బాయిపై పుట్టుచ్చు.. అంతే కాదు.. ఇద్దరు అమ్మాయిల మధ్య, ఇద్దరు అబ్బాయిల మధ్య కూడా ప్రేమ పుట్టిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి.. అయితే, అది మరింత ఘాటుగా మారి.. ఆమె కోసం అతడిగా మారేందుకు ఓ మహిళ ఆపరేషన్‌ చేయించుకున్న ఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

ప్రేమకోసం ఏదైనా చేసే వాళ్ళను చూశాం. కానీ తాను ప్రేమించిన ప్రేయసి కోసం లింగ మార్పిడి చేయించుకుంది రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌‌కు చెందిన మీరా. భరత్‌పూర్‌‌లోని ఓ పాఠశాలలో పీఈటీ టీచర్‌గా పనిచేస్తున్న మీరా అదే పాఠశాలలో చదువుకుంటున్న కల్పనతో ప్రేమలో పడింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి, లింగమార్పిడి చేయించుకొని వివాహమాడింది. వీళ్ల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో ఓ స్కూల్ టీచర్ తన విద్యార్థిని పెళ్లి చేసుకోవడానికి లింగమార్పిడి చేయించుకుంది. ప్రేమ కోసం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయిన మీరా తను లింగమార్పిడి చేయించుకొంది. కల్పన చదువుతున్న భరత్‌పూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా మీరా పని చేస్తోంది. స్కూల్‌లో ఉన్నప్పుడు మీరాతో ప్రేమలో పడిన విషయాన్ని కల్పన గుర్తు చేసుకుంది. “మీరా స్కూల్లో మా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. అప్పుడే ప్రేమలో పడ్డాను. ఇక మూడేళ్ల క్రితం మీరా లింగమార్పిడి చేయించుకుంది. మా ఇద్దరి కుటుంబాలు పెళ్ళికి అంగీకరించడంతో పెళ్లి చేసుకున్నాం’ అని కల్పన తెలిపింది.