Tamilisai Soundararajan : తమిళనాడు బీజేపీ నేత, మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వర్గం గొడ్డు మాంసం తింటామని చెబుతోంది, అది వారి హక్కు. ఇంకొక వర్గం తమ ఆరోగ్య ప్రయోజనాల కోసం గోమూత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ విషయంపై ఎందుకు ప్రశ్నిస్తున్నారు..? ’’ అని ఆమె ప్రశ్నించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి తన తండ్రికి జ్వరం వచ్చినప్పుడు గోమూత్రంతో చికిత్స చేయడం గురించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వెల్లడించారు. ఆయన ప్రకారం, గోమూత్రం తాగడం వలన 15 నిమిషాల్లోనే జ్వరం తగ్గిపోయింది, అలాగే గోమూత్రం యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుందని తెలిపారు. ఆయన గోమూత్రం కొన్ని కడుపు సంబంధిత వ్యాధులపై ప్రభావం చూపుతుందని కూడా చెప్పినట్లు చెప్పారు.
Harish Rao : మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..?
ఈ వ్యాఖ్యలపై వివిధ నాయకులు , ప్రజలు స్పందించారు. కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆయన వ్యాఖ్య ప్రకారం, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ఇలాంటి సూడోసైన్స్‌ను ప్రచారం చేయడం గౌరవప్రదమైనది కాదని పేర్కొన్నారు. డీఎంకే నేత ఎలంగోవన్ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించి, ‘‘గోమూత్రం తాగడం ద్వారా వ్యాధులు తగ్గుతాయని ఎవరు చెప్పారని’’ ప్రశ్నించారు. ప్రధాని మోడీ ఐఐటీకి బదులుగా కామకోటిని ఎయిమ్స్‌కి బదిలీ చేయాలని ఎలంగోవన్ అన్నారు.
అయితే.. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి వ్యాఖ్యలకు మద్దతుగా తమిళసై సౌందర రాజన్ పై వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఇక, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఈ వ్యాఖ్యలపై మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ, ‘‘డీఎంకే , ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నాయి’’ అని ఆరోపించారు. కామకోటి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవి అని అన్నామలై తెలిపారు. ఈ వివాదం తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చలను పుట్టించడం మొదలు పెట్టింది, దీనిపై ఇంకా మరిన్ని వివరణలు, దర్యాప్తులు జరగవచ్చు.