Kaman Bridge Vs Tragedy : జమ్మూ కశ్మీర్‌ను భూలోక స్వర్గం అని పిలుస్తారు. బ్యూటిఫుల్ నేచర్‌తో అది అంత అందంగా ఉంటుంది. అక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాల గురించి నేటికీ చాలామందికి తెలియదు. భారత్‌లోని జమ్మూ ప్రాంతాన్ని, పాక్ ఆక్రమిత జమ్మూ ప్రాంతాన్ని కలిపేందుకు ఒకే ఒక వంతెన ఉంది. దాని పేరు.. కమాన్-అమన్ సేతు వంతెన. దీన్ని ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. ఈ వంతెన భారత భూభాగం నుంచి పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ వరకు విస్తరించి ఉంది. ఈ వంతెనపై నిలబడి జమ్మూ ప్రజలు పాకిస్తాన్ సరిహద్దును చూడొచ్చు. పాకిస్తాన్ ప్రజలు జమ్మూలోని అందమైన లోయలను చూడొచ్చు.
Also Read :Anantapur Border : అనంతపురం బార్డర్‌లో వందలాదిగా పారా ట్రూపర్లు.. ఎందుకు?
ఈ వంతెన.. ఎందుకు ?
భారత్ – పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖపై ‘కమాన్ అమన్ సేతు’ వంతెనను నిర్మించారు. సరిహద్దుకు రెండు వైపులా నివసిస్తున్న కుటుంబాలు రాకపోకలు సాగించడానికి ‘కమాన్ అమన్ సేతు’ను 2005లో ప్రారంభించారు. ఈ వంతెన మీదుగా 2008లో, రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా మొదలైంది. 2019 ఫిబ్రవరిలో జమ్మూకశ్మీరులోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్ర దాడి జరిగింది, ఆ దాడిలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో 2019లో ‘కమాన్ అమన్ సేతు’ను మూసివేశారు.ఎట్టకేలకు ఆరేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఇటీవలే ఈ వంతెన మార్గాన్ని తెరిచారు. ఎందుకో తెలుసుకుందాం..
Also Read :Railway Pass Rules: రైల్వే పాస్‌ల జారీ.. కొత్త రూల్ అమల్లోకి
‘కమాన్ అమన్ సేతు’.. ఎందుకు తెరిచారు ?
యాసిర్ హుస్సేన్ షా వయసు 22 ఏళ్లు. ఆయేషా బానో వయసు 21 ఏళ్లు. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 2025 మార్చి 5న కశ్మీర్‌లోని ఉరీ ప్రాంతంలో జీలం నదిలో ఈ లవర్స్ గల్లంతయ్యారు. నదీ ప్రవాహం కారణంగా వారిద్దరి మృతదేహాలు నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ పాలిత కశ్మీర్(Kaman Bridge Vs Tragedy) పరిధిలోకి చేరాయి. మార్చి 19న పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లోని చినారి సెక్టార్‌లో ఆయేషా బానో మృతదేహాన్ని అక్కడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల తరువాత (మార్చి 21న) చినారి సెక్టార్ సమీపంలోని చకోతి ప్రాంతంలో యాసిర్ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై భారత్, పాక్ సైన్యాలు పరస్పరం సంప్రదించుకొని, డెడ్‌బాడీలను కుటుంబాలకు అప్పగించాలని నిర్ణయించుకున్నాయి. మార్చి 22న పాకిస్తాన్ సైన్యం రెండు మృతదేహాలను భారత సైన్యానికి అప్పగించింది. తరువాత అధికారులు, పోలీసుల సమక్షంలో వారి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించారు. ఈ డెడ్‌బాడీల అప్పగింత ప్రక్రియ కోసమే కమాన్-అమన్ సేతు వంతెనను తెరిచారు.