IRCTC With Swiggy: ట్రైన్ లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒప్పందం కుదుర్చుకున్నాయి.

IRCTC With Swiggy: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ముందస్తు ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడానికి ఈ ఒప్పందం జరిగింది. ఐఆర్సీటీసీ (IRCTC) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ మరియు స్విగ్గీ ఫుడ్ మార్కెట్ సీఈఓ రోహిత్ కపూర్‌ల మధ్య రెండు సంస్థల ఎంఓయూ జరిగింది.

అవగాహన ఒప్పందంలో భాగంగా స్విగ్గీ తన నెట్‌వర్క్ ని విస్తరిస్తుంది. తద్వారా బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం మరియు విజయవాడలలో ప్రారంభమయ్యే ప్రయాణికులకు ఆహారాన్ని అందజేస్తుంది. రాబోయే వారాల్లో ఈ సేవ 59 అదనపు సిటీ స్టేషన్లకు విస్తరించే అవకాశం ఉంది. రాష్ట్రాలు మరియు జిల్లాల మీదుగా ప్రయాణించే ఈ రైలు ప్రయాణాల సమయంలో, భోజనాన్ని ఆర్డర్ చేసే అవకాశం ఉంటే, అది మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందులో భాగంగానే ఇరు సంస్థలు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

మొదటి దశలో బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం మరియు భువనేశ్వర్ స్టేషన్లలో డెలివరీలను ప్రారంభిస్తున్నామని తెలిపారు స్విగ్గీ సంబంధిత అధికారులు. ఈ మార్గంలో ప్రయాణీకులు మరియు రెస్టారెంట్ నిర్వాహకుల నుండి మంచి స్పందన లభిస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ సదుపాయాన్ని మరిన్ని స్టేషన్‌లలో కల్పిస్తామని, మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రయాణికులకు డెలివరీ చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.

Also Read: Black Raisins Benefits: న‌ల్ల ఎండు ద్రాక్షలు తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!