Site icon HashtagU Telugu

Spy Pigeon: ఒడిశాలో గూఢచారి పావురం.. కాళ్లకు కెమెరా, మైక్రో చిప్..!

Spy Pigeon

Resizeimagesize (1280 X 720) 11zon

ఒడిశా పోలీసులు జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ బీచ్ సమీపంలో గూఢచారి పావురాన్ని (Spy Pigeon) పట్టుకున్నారు. ఈ పావురం కాలికి కెమెరా, మైక్రోచిప్‌ని అమర్చారు. ఈ ప్రాంతంలో గూఢచర్యానికి ఈ పావురాన్ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో వారి బోటులో పావురం కనిపించింది. మత్స్యకారులు అనుమానాస్పదంగా కనిపించిన పావురాన్ని పట్టుకుని బుధవారం (మార్చి 8) పారాదీప్ మెరైన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు

వెటర్నరీ డాక్టర్ పక్షిని పరీక్షిస్తారని జగత్‌సింగ్‌పూర్ పోలీస్ సూపరింటెండెంట్ రాహుల్ తెలిపారు. పావురం పాదాలకు అమర్చిన పరికరాలను పరిశీలించేందుకు రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ సహాయం తీసుకోనున్నారు. ఇది కెమెరా, మైక్రోచిప్ లాగా కనిపిస్తోందని అన్నారు. అలాగే పావురం రెక్కలపై స్థానిక పోలీసులకు అర్థంకాని మరో భాషలో ఏదో రాసి ఉంది. దాన్ని చదవడానికి నిపుణుల సహాయం తీసుకుంటున్నారు.

Also Read: 20 Sheeps Killed: గద్వాల్ లో రెచ్చిపోయిన వీధికుక్కలు.. 20 గొర్రెలు మృతి!

ఈ పావురాన్ని పట్టుకున్న పీతాంబర్ బెహెరా పడవలోనే పనిచేస్తాడు. పడవపై కూర్చున్న పావురాన్ని తాను చూశానని పీతాంబర్ తెలిపారు. అకస్మాత్తుగా పక్షి కాలికి కొన్ని పరికరాలు తగిలినట్లు గమనించాను. నాకు ఈ విషయం వింతగా అనిపించింది. దీని తర్వాత పావురాన్ని పట్టుకున్నారు. దాని రెక్కలపై కూడా ఏదో రాసి ఉన్నట్లు గుర్తించారు. ఇది ఒడియాలో రాయలేదని నాకు అర్థమైందని ఆయన తెలిపారు. 10 రోజుల క్రితం పావురం సముద్రంలో చిక్కుకుంది. అప్పుడు పడవ కోణార్క్ తీరానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.