Site icon HashtagU Telugu

3D Ram Mandir : అయోధ్య రామమందిరం 3డీ ప్రతిమల సేల్స్ జూమ్

3d Ram Mandir

3d Ram Mandir

3D Ram Mandir : అయోధ్య రామమందిరంపై ఇప్పుడు దేశమంతటా చర్చ జరుగుతోంది. జనవరి 22న రామమందిరం ప్రారంభం కానున్న తరుణంలో 3డీ ప్రింటెడ్ అయోధ్య రామమందిరం  ప్రతిమల సేల్స్ ఊపందుకున్నాయి. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్‌లోని పారిశ్రామిక పట్టణం ఘజియాబాద్‌లో రామాలయ 3డీ బొమ్మలు పెద్దసంఖ్యలో సేల్ అవుతున్నాయి. వీటితో పాటు తాజ్ మహల్, కుతుబ్ మినార్, ఇండియా గేట్, గేట్‌వే ఆఫ్ ఇండియా 3డీ ప్రతిమలు కూడా బాగానే అమ్ముడుపోతున్నాయి. ఇయర్ ఎండ్ కావడంతో సన్నిహితులకు గిఫ్టుగా ఇవ్వడానికి రామమందిరం 3డీ బొమ్మలను(3D Ram Mandir) ప్రజలు పెద్దఎత్తున కొంటున్నారని తయారీదారులు చెబుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

3డీ రామమందిరం ప్రతిమలను తయారు చేస్తున్న ఘజియాబాద్‌ వాసి రాహుల్ మహాజన్ మాట్లాడుతూ..  గత ఆరు నెలల్లో రామ మందిరం 3డీ బొమ్మలకు డిమాండ్ 100 శాతానికిపైగా పెరిగిందన్నారు. ఘజియాబాద్‌లోని ఫర్నీచర్ మార్కెట్‌లో ఉన్న తన  ప్రింటింగ్ స్టూడియోలో వీటిని తయారు చేస్తున్నానని చెప్పారు. 3D ప్రింటింగ్ సాంకేతికత, లేజర్ కటింగ్‌ ప్రక్రియను ఉపయోగించి వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. మెషీన్‌పై ఒక 3డీ ప్రింట్ తయారీకి  ఐదు గంటల టైం పడుతోందన్నారు. ఆన్‌లైన్‌లో కూడా తమకు చాలా ఆర్డర్స్ వస్తున్నాయని తెలిపారు.

Also Read: 274 Jobs : నేషనల్​ ఇన్సూరెన్స్ కంపెనీ‌లో 274 జాబ్స్