SC YouTube Channel Hacked: ఈ మధ్య హ్యాకర్లు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చితక ఖాతాలను హ్యాక్ చేయడం లేదు. ఏకంగా దేశాధిపతుల సోషల్ మీడియా ఖాతాలను, బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలపై దృష్టి సారిస్తున్నారు. డబ్బుతో పాటు పేరు కోసం హ్యాకర్లు ఈ విధంగా బడా సంస్థలు, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఏకంగా సుప్రీంకోర్టు (Supreme Court) కు సంబందించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ (YouTube Channel)ని హ్యాకర్లు హ్యాక్ చేశారు.
షాహీ ఈద్గా-కృష్ణా జన్మభూమి కేసుకు సంబంధించి ముస్లింల తరపు పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.మునుపటి విచారణల వీడియోలను హ్యాకర్లు ప్రైవేట్‌లో పెట్టారు. యూట్యూబ్ ఛానెల్ లో సుప్రీంకోర్టు విచారణకు బదులుగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేశారు. యూఎస్ కు చెందిన రిపిల్ ల్యాబ్స్ కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ ఆర్పీని ప్రమోట్ చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానంకు సంబందించిన ఛానెల్ హ్యాక్ అవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకుని అధికారులు నివ్వెరపోయారు.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ ఇటీవలే స్వయంగా ప్రత్యక్ష ప్రసారం చేసింది. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అవ్వడంపై మరోసారి భద్రత వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు సాధారణ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ అత్యున్నత ధర్మాసం యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కు గురైతే.. సాధారణ ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఐటి రంగ నిపుణులతో కలిసి పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల