Constitutions Preamble : భారత రాజ్యాంగంలో ‘ప్రవేశిక’ ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్‌లో ప్రియాంబుల్ (Preamble) అని పిలుస్తాం. రాజ్యాంగ గ్రంథాన్ని తెరవగానే అందులో తొలుత ‘ప్రవేశిక’ ఉంటుంది. భారత రాజ్యాంగం ఆశయాలు, లక్ష్యాలు, ఉద్దేశాల గురించి అందులో స్పష్టమైన ప్రస్తావన ఉంటుంది. తాజాగా ఇవాళ భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించి ఒక సంచలన తీర్పును వెలువరించింది. అదేమిటంటే..
Also Read :Ranganath House : మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు : ‘హైడ్రా’ కమిషనర్ రంగనాథ్
భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ అనే పదాలు ఉన్నాయి. వాస్తవానికి మన దేశానికి స్వాతంత్య్రం రాగానే సిద్ధం చేసుకున్న రాజ్యాంగ గ్రంథంలోని ప్రవేశిక(Constitutions Preamble)లో ఆ రెండు పదాల ప్రస్తావన లేదు. 1966 సంవత్సరం నుంచి 1977 వరకు మన దేశ ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ వ్యవహరించారు. అయితే 1976లో భారత్‌లో ఎమర్జెన్సీ ఛాయలు ఇంకా మిగిలి ఉన్న టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి 42వ సవరణ చేసింది. ఈ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ అనే పదాలను ఆమె చేర్చారు. ఈ ప్రక్రియ అంతా ఆనాడు పార్లమెంటు ఉభయ సభల ఆమోదంతోనే.. చట్టప్రకారంగానే జరిగింది. అయితే ఈ రెండు పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడాన్ని తప్పుపడుతూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, బలరాం సింగ్, అడ్వకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రవేశికలో నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని వారు కోరారు.
Also Read :Google Doodle : గూగుల్ డూడుల్ చూశారా ? గుకేష్ దొమ్మరాజు, డింగ్ లిరెన్‌లకు అరుదైన గౌరవం
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని ధర్మాసనం దీనిపై గత శుక్రవారం విచారించింది. ఇరుపక్షాల వాదనలను సుప్రీంకోర్టు బెంచ్ నోట్ చేసుకుంది. భారత సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పును వెలువరిస్తూ.. ఆయా పిటిషన్లను కొట్టివేసింది. రాజ్యాంగ ప్రవేశికలో నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగించడం కుదరదని తేల్చి చెప్పింది. 1976లో ఇందిరాగాంధీ హయాంలో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమైందే అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. సోషలిజం, సెక్యులరిజం అనేవి దేశ ఉన్నతికి దోహదపడే అంశాలేనని సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.