Site icon HashtagU Telugu

Citizenship Act : పౌరసత్వ చట్టంలోని ‘సెక్షన్‌ 6ఏ’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Supreme Court Citizenship Act Section 6a

Citizenship Act :  1966 జనవరి నుంచి 1971 మార్చి 25లోగా అసోంకు వచ్చిన వలసదారులు పౌరసత్వం కోరవచ్చని పౌరసత్వ చట్టం-1955లోని ‘సెక్షన్‌6ఏ’ చెబుతోంది. దీని రాజ్యాంగ బద్ధత‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ కీలక నిర్ణయాన్ని వెలువరించింది. సెక్షన్‌ 6ఏ రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ జేబీ పార్థీవాలా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనికి సంబంధించిన పిటిషన్‌ను విచారించింది. మొత్తం ఐదుగురు న్యాయమూర్తుల్లో నలుగురు.. సెక్షన్‌ 6ఏ రాజ్యాంగ బద్ధతను(Citizenship Act) సమర్ధించారు. అయితే  జస్టిస్‌ పర్దీవాలా సెక్షన్‌ 6ఏ రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు భిన్నాభిప్రాయాలతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 4:1 మెజార్టీతో తీర్పును ప్రకటించింది.

Also Read :Winter Tips : వర్షాకాలంలో పిల్లలకు వ్యాపించే వ్యాధులకు దివ్యౌషధం ఇదిగో..!

ఏమిటీ కేసు ? 

Also Read :Hyderabad Elections : ‘గ్రేటర్’ ఎన్నికలకు బీఆర్ఎస్ ముందస్తు స్కెచ్

అక్రమ వలసలకు అస్సాం అకార్డ్‌  రాజకీయ పరిష్కారాన్ని చూపించగా..  సెక్షన్‌-6ఎ చట్టబద్ధమైన మార్గాన్ని చూపించిందని సీజేఐ చంద్రచూడ్‌  అన్నారు. స్థానికుల ప్రయోజనాలను కాపాడే సమతౌల్యత ఈ సెక్షన్‌కు ఉందన్నారు. సెక్షన్‌-6ఎలోని కటాఫ్‌ డేట్‌గా నిర్ణయించిన 1971 మార్చి 25 అనేది సరైనదేనని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆ తేదీ నాటికే బంగ్లాదేశ్‌ యుద్ధం ముగిసిందని గుర్తు చేశారు. సెక్షన్‌-6ఎ అంత ఎక్కువగా జనాభాను కలుపుకోలేదు, మరీ తక్కువగాను విలీనం చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.