Ajit Pawar : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత అజిత్ పవార్‌కు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్‌పవార్ ఫొటోలు, వీడియోలను మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వాడుకోవద్దని ఆయనకు హితవు పలికింది. సొంత పార్టీని పెట్టుకున్నప్పుడు.. సొంత కాళ్లపై నిల్చోవడం నేర్చుకోవాలని అజిత్‌కు సూచించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబరు 20న జరగనుంది. ఈ తరుణంలో సుప్రీంకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు అజిత్ పవార్ ఎన్‌సీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అజిత్ పవార్ ఎన్‌సీపీ శ్రేణులు పలుచోట్ల శరద్ పవార్ ఫొటోలు, వీడియోలను వాడారు. దీనిపై పలువురు శరద్ పవార్ అనుచరులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది.
Also Read :Bust Auction : జాక్‌పాట్.. రూ.540కి కొన్న శిల్పానికి రూ.2.68 కోట్ల రేట్
‘‘అజిత్ పవార్ ఎన్‌సీపీ, శరద్ పవార్ ఎన్‌సీపీ రెండూ వేర్వేరు పార్టీలు. ఈ పార్టీలు దేనికి అవిగా సెపరేటుగా పనిచేయాలి. దీనికి సంబంధించి మేం గతంలో ఇచ్చిన ఆదేశాలను ఇరుపార్టీలు పాటించాలి. అజిత్ పవార్ ఎన్‌సీపీ దాని కాళ్లపై అది నిలబడాలి. ఎందుకంటే రెండు పార్టీల సైద్ధాంతిక భావజాలం వేర్వేరు. శరద్ పవార్ నుంచి విడిపోయినందున ఆయన ఫొటోలు, వీడియోలను అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీ వాడటానికి వీల్లేదు’’ అని సుప్రీంకోర్టు బెంచ్ తేల్చి చెప్పింది.
Also Read :President Droupadi Murmu : ‘లోక్ మంథన్ – భాగ్యనగర్ 2024’.. 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన
శరద్ పవార్ సొంత మేనల్లుడే అజిత్ పవార్. గతంలో శరద్ పవార్ ఎన్‌సీపీలోనే అజిత్ ఉండేవారు. అయితే మెజారిటీ ఎన్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి శరద్ పవార్‌పై అజిత్ పవార్ గతేడాది తిరుగుబాటు చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో ఎన్‌సీపీ గుర్తు, పేరులను అజిత్ పవార్‌కే కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది. ఈనేపథ్యంలో శరద్ పవార్(Ajit Pawar) ఎన్‌సీపీ-ఎస్‌పీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.