Supreme Court : కేజ్రీవాల్‌ పిటిషన్‌..అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 12:10 PM IST

 

Supreme Court: ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwals) ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో (Delhi excise policy Case) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు (urgently hear) సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఈ మేరకు కేజ్రీ పిటిషన్‌ను సీజేఐ ప్రత్యేక బెంచ్‌కు కేటాయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై విచారణ జరపనుంది.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఈ కేసులో ఈడీ తనను బలవంతంగా అరెస్ట్‌ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరుతూ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించలేమంటూ గురువారం మధ్యాహ్నం తీర్పునిచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ న్యాయవాదులు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆ బృందం సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసింది. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరపాల్సిందిగా న్యాయస్థానానికి విన్నవించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.

read also: Indias Longest Bridge : పదుల సంఖ్యలో కూలీల మృతి.. కుప్పకూలిన దేశంలోనే పొడవైన వంతెన!