Site icon HashtagU Telugu

VIRAL: పోలీస్ జాబ్స్.. సన్నీలియోన్ పేరిట అడ్మిట్ కార్డు

Sunny Leone Admit Card

Sunny Leone Admit Card

యూపీ పోలీస్ రిక్రూట్ మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డుపై నటి సన్నీలియోన్ (Sunny Leoone) ఫొటో దర్శనమిచ్చింది. ఆమె పేరు, ఫొటోతో ఉన్న అడ్మిట్ కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. UPPRB వెబ్ సైట్‌లో సన్నీలియోన్ ఫొటోతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యూపీలోని 75 జిల్లాల్లోని 2,385 పరీక్షా కేంద్రాల్లో నిన్న ఈ నియామక పరీక్ష జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

వైరల్ అడ్మిట్ కార్డ్‌ను పరిగణలోకి తీసుకున్న UPPRB సన్నీ లియోన్ పేరుతో ఉన్న అడ్మిట్ కార్డ్ “ఫేక్” అని చెప్పింది. UPPRB అధికారుల ప్రకారం, పరీక్ష కోసం దరఖాస్తు సమయంలో, ఒక అభ్యర్థి తప్పు ఫోటోలను అప్‌లోడ్ చేసారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అభ్యర్థి ఆధార్ కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో పరీక్షకు హాజరుకావాలని అధికారులు ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష శనివారం ప్రారంభమైంది. 60,244 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో రెండు రోజుల పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలో అభ్యర్థులను స్థానంలో పరీక్ష రాసేందకు వచ్చిన 120 మందికి పైగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మొత్తం 122 మంది అరెస్టయిన వారిలో ఎటాలో 15 మంది, మౌ, ప్రయాగ్‌రాజ్ మరియు సిద్ధార్థనగర్‌లో ఒక్కొక్కరు, ఘాజీపూర్‌లో 8 మంది, అజంగఢ్‌లో ఏడుగురు, గోరఖ్‌పూర్‌లో ఆరుగురు, జౌన్‌పూర్‌లో ఐదుగురు, కౌశాంబిచ హత్రాస్‌లలో ఒక్కొక్కరు ముగ్గురు, ఝాన్సీ, వారణాసి, ఆగ్రా మరియు కాన్పూర్‌లలో ఒక్కొక్కరు, బల్లియా, డియోరియా మరియు బిజ్నోర్‌లలో ఒక్కొక్కరు, ఫిరోజాబాద్‌లో నలుగురు ఉన్నారని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ప్రశాంత్ కుమార్ తెలిపారు. పరీక్ష సమయంలో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన 15 మందిని శనివారం అరెస్టు చేసినట్లు డిజిపి ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు.

Read Also : TDP-JSP : గోదావరి జిల్లాల్లో టీడీపీ- జేఎస్పీ ఎఫెక్ట్‌..!