Site icon HashtagU Telugu

Sumalatha: బీజేపీలోకి సుమలత.. కర్ణాటక సీఎం ఏం అన్నారంటే..?

Sumalatha

Sumalatha

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాండ్య లోక్‌సభ సభ్యురాలు సుమలత (Sumalatha) అంబరీష్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరతారనే ఊహాగానాల మధ్య, దీనిపై చర్చలు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గురువారం తెలిపారు. ఇండిపెండెంట్ ఎంపీ సుమలత శుక్రవారం మాండ్యలో విలేకరుల సమావేశంలో బీజేపీలో చేరే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

మార్చి 12వ తేదీన మాండ్యలో ప్రధాని నరేంద్రమోదీ జరగనున్న పర్యటనకు ముందే ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించేందుకు, అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరెకు మోదీ రానున్నారు. మాండ్యలో 1.5 కిలోమీటర్ల రోడ్ షోలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. రాజకీయ నాయకురాలు సుమలత బీజేపీలో చేరడం, దీనికి సంబంధించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడంపై అడిగిన ప్రశ్నకు బొమ్మై విజయపురలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రక్రియ కొనసాగుతోంది, చర్చలు జరుగుతున్నాయని అన్నారు.

Also Read: New iPhones: కొత్త కలర్స్ లో ఐఫోన్14, ఐఫోన్14 ప్లస్.. ధర, ఫీచర్స్ ఇవే?

మేలో జరగనున్న మాండ్య అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మండ్య జిల్లాలోని ఏదైనా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి యాదగిరిలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇంత కాలం వేచి చూశారు. మరో 24 గంటల సమయం ఇవ్వండి. నాకు తెలియని దాన్ని నేను ధృవీకరించలేను అన్నారు. ఎంపీ సుమలత ఒకప్పుడు పేరొందిన నటి. దివంగత నటుడు, రాజకీయ నాయకుడు ఎంహెచ్ అంబరీష్ భార్య. 2019 ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభకు పోటీ చేసిన ఆమె అప్పటి సీఎం హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిపై 1,25,876 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు.