New Election Commissioners: నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సంధు, జ్ఞానేశ్‌ కుమార్‌!

    New Election Commissioners India : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రధాని మోడీ(pm modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైంది. కొత్త ఎన్నికల కమిషనర్ల(New Election Commissioners) ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఛౌదరీ పేర్లను బయటపెట్టారు. ఈసీలుగా మాజీ బ్యూరోక్రాట్లు పంజాబ్‌(Punjab)కు చెందిన సుఖ్‌బీర్‌ సింగ్ సంధు(Sukhbir […]

Published By: HashtagU Telugu Desk
Sukbhbir Sandhu, Gyanesh Ku

Sukbhbir Sandhu, Gyanesh Ku

 

 

New Election Commissioners India : కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రధాని మోడీ(pm modi) నేతృత్వంలోని ఎంపిక కమిటీ గురువారం సమావేశమైంది. కొత్త ఎన్నికల కమిషనర్ల(New Election Commissioners) ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ ఛౌదరీ పేర్లను బయటపెట్టారు. ఈసీలుగా మాజీ బ్యూరోక్రాట్లు పంజాబ్‌(Punjab)కు చెందిన సుఖ్‌బీర్‌ సింగ్ సంధు(Sukhbir Singh Sandhu), కేరళ(Kerala)కు చెందిన జ్ఞానేశ్ కుమార్‌(Gyanesh Kumar)ను ఎంపిక చేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.
నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ నేతృత్వంలోని సెర్చ్‌ కమిటీ ప్రతిపాదిత పేర్లతో జాబితాను రూపొందించింది. అనంతరం మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సమావేశమై దీనిపై చర్చించింది. ఇందులో అధీర్‌తో పాటు కేంద్రహోం మంత్రి అమిత్ షా సభ్యులుగా ఉన్నారు. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన అధీర్‌ రంజన్‌ ఛౌదరీ ఎంపిక కమిటీలో ప్రభుత్వానికే మెజార్టీ ఉందన్నారు. తొలుత తనకు 212 పేర్లను పంపించారని, సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారని తెలిపారు. ఈసీల ఎంపికకు అనుసరిస్తున్న ప్రక్రియలో లోపాలున్నాయని పేర్కొన్నారు. గత నెల ఒక ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా ఇటీవల మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల సంఘంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.

read also: Thalapathi Vijay : దళపతి సినిమాలో ఆ హీరోయిన్ కూడా..?

  Last Updated: 14 Mar 2024, 02:50 PM IST