Onions Santa : ఉల్లిపాయలతో ప్రపంచంలోనే పెద్ద శాంతాక్లాజ్

Onions Santa : ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ సందర్భంగా తన ఆర్ట్‌ క్రియేటివిటీని మరోసారి ప్రదర్శించారు.

Published By: HashtagU Telugu Desk
Onions Santa

Onions Santa

Onions Santa : ప్రముఖ ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ క్రిస్మస్ సందర్భంగా తన ఆర్ట్‌ క్రియేటివిటీని మరోసారి ప్రదర్శించారు. ఉల్లిపాయలను ఉపయోగించి అందమైన శాంతాక్లాజ్ ఇసుక శిల్పాన్ని ఆయన రూపొందించారు. ‘గిఫ్ట్ ఎ ప్లాంట్, గ్రీన్ ది ఎర్త్’ అనే సందేశంతో పూరీలోని బ్లూ ఫ్లాగ్ బీచ్‌లో ఉల్లిపాయల శాంతాక్లాజ్‌ను (Onions Santa) ఆయన తయారు చేశారు. ఈ భారీ సైకత శిల్పాన్ని తయారు చేసేందుకు తాను 2 టన్నుల ఉల్లిపాయలను వాడానని సుదర్శన్ పట్నాయక్ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయల శాంతాక్లాజ్‌ 100 అడుగుల పొడవు,  20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈరోజు ఒక మొక్కను ఇతరులకు బహుమతిగా ఇచ్చి.. భూమిని పచ్చగా మార్చాలనే సందేశాన్ని ఈ శాంతాక్లాజ్ ద్వారా ఇచ్చామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నాలుగో శతాబ్దంలో సెయింట్ నికోలస్ అనే వ్యక్తి టర్కీలోని మైరాలో నివసించేవాడు. అతను చాలా ధనవంతుడు. నికోలస్ తన తల్లిదండ్రులను కోల్పోతాడు. దీంతో నికోలస్ అనాథగా మారిపోతాడు. ఆ తర్వాత అతడు రహస్యంగా పేదలకు సహాయం చేసి సంతోషించేవాడు. మైరాలో నివసిస్తున్న ఒక పేద వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు ఉండేవారు. అతనికి తన కూతుళ్ల వివాహం కష్టతరంగా మారింది. ఆ అమ్మాయిల పెళ్లికి సాయం చేయాలని అనుకున్న నికోలస్ సాక్స్‌లలో బంగారాన్ని ఉంచాడు. వాటిని ఆ  ఇంటి చిమ్నీలోకి బ్యాగ్లో పెట్టి  వాళ్ల ఇంట్లోకి విసిరాడు. ఒకటి కాదు.. మూడు సార్లు బంగారు సాక్స్‌లను నిరుపేద ఆడపిల్లల ఇంట్లో వేశాడు. చివరకు నికోలస్‌ను ఆ ఆడపిల్లల తండ్రి చూశాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని నికోలస్ అన్నాడు. అప్పటి నుంచి శాంతాక్లాజ్ గిఫ్టుల పరంపర మొదలైంది.

  Last Updated: 25 Dec 2023, 08:53 AM IST