Site icon HashtagU Telugu

Street Dog Attack : గుజరాత్‌లో వీధికుక్క‌ల స్వైర విహారం.. ఏడేళ్ల బాలుడిపై దాడి

Govt Bans Dogs

Dogs

గుజరాత్‌లోని దాహోద్‌లో వీధి కుక్క‌లు స్వైర విహారం చేస్తున్నాయి. ఇద్దరు స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగురవేస్తున్న ఏడేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. బాధితుడిని ముఖేష్ భాబోర్‌గా గుర్తించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దహోద్‌ జిల్లాలోని ఫతేపురా గ్రామంలోని ఓ ఓపెన్‌ ఫామ్‌లో ముఖేష్‌, అతని ఇద్దరు స్నేహితులు గాలిపటాలు ఎగురవేస్తుండగా వీధికుక్క అతనిపై దాడి చేయ‌డంతో త‌ల‌పై గాయాలైయ్యాయి. బాలుడు ముఖేష్ కేకలు వేయడంతో స్థానికులు అతనిని రక్షించి ఫతేపురాలోని స్థానిక క్లినిక్‌లో చేర్చారు. అక్కడి వైద్యులు దాహోద్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అదే రోజు గుజరాత్‌లో కుక్కల దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో సూరత్‌లోని తన ఇంటి బయట ఆడుకుంటున్న ఓ బాలిక వీధికుక్క కాటుకు గురై తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ముఖంపై చాలా కుట్లు వేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. కుక్క దాడి నుంచి కూతురిని రక్షించే క్రమంలో బాలిక తల్లి కూడా గాయపడింది.

Exit mobile version