Site icon HashtagU Telugu

Stop Eating Tomatoes : టమాటాలు తినడం మానేయమంటున్న బీజేపీ మంత్రి..

Stop Eating Tomatoes Or Grow Them At Home -UP minister Pratibha Shukla

Stop Eating Tomatoes Or Grow Them At Home -UP minister Pratibha Shukla

టమాటా ధర తగ్గాలంటే ప్రజలు టమాటాలు (Tomatoes) తినడం మానేయాలంటూ ఉచిత సలహా ఇచ్చారు ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ మంత్రి ప్రతిభా శుక్లా (UP minister Pratibha Shukla). ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టమాటా కు ఎంత డిమాండ్ ఉందొ చెప్పాల్సిన పనిలేదు. గత నెలన్నర గా కేజీ టమాటా (Tomato Price) ధర రూ.120 నుండి 150 పలుకుతుంది. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగానే ఉంది. దీంతో టమాటా ధర ఎప్పుడు తగ్గుతుందో అని సామాన్య ప్రజలు ఎదురుచూస్తుంటే తగ్గేదెలా అంటుంది టమాటా. దీంతో కొంతమంది టమాటాలు దొంగతనం చేయడం అలవాటుగా చేసుకున్నారు. మార్కెట్ లలో , ఇండ్లలోనే కాదు హైవే లపై కూడా టమాటా ట్రక్ లను ఎత్తుకెళ్తున్నారు.

ఈ క్రమంలో టమాటా ధర తగ్గాలంటే ప్రజలు (People ) టమాటాలు తినడం మానేయాలంటూ ఉచిత సలహా ఇచ్చారు ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ మంత్రి ప్రతిభా శుక్లా. టమాటాలు తినకండి.. ధరలు వాటంతట అవే దిగివస్తాయని పేర్కొన్నారు. అలాగే ప్రజలు ఇంటి వద్దే టమాటా మొక్కలు పెంచుకోవాలని సూచించారు. టమాటాలకు బదులు నిమ్మకాయలు వాడాలని, టమాటాలు ఎవరూ తినకుంటే వాటి ధరలు అవే దిగివస్తాయని తెలిపారు. ధరలు కట్టడికి చర్యలు తీసుకోకుండా, టమాటాలు తినకండి అంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో నెటిజన్లు ఆడేసుకుంటుంటారు. ధరలను నియంత్రించడం తమ చేతకాదని ప్రభుత్వం అంగీకరించిందని మంత్రి వ్యాఖ్యలతో తేలిపోయిందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది.

గతంలో ‘ఉల్లిపాయలు తినకండి. మా ఇంట్లో వాటిని వాడటం లేదు. తినడం మానేస్తేనే ధరలు కిందికి దిగి వస్తాయి’ అంటూ ఉల్లి ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే మాదిరి మంత్రి ప్రతిభా శుక్లా మాటలు ఉన్నాయని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో బియ్యం ధరలు పెరిగితే.. ‘భోజనం చేయడం మానేయండి. బియ్యం ధరలు కిందకి దిగి వస్తాయి అని అంటారేమో అని మీమ్స్ వేస్తున్నారు.

Read Also : Yamuna Floods: ఉప్పొంగిన యమునా.. కేంద్ర జల సంఘం హెచ్చరికలు