Steve Jobs Wife : యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. పరమపవిత్ర మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో నిరంజనీ అఖాడాకు చెందిన స్వామి కైలాసానంద గిరి నిర్వహిస్తున్న ఆశ్రమంలో ఆమె బస చేస్తున్నారు. ప్రయాగ్ రాజ్‌లో భారీగా జనం రద్దీ ఉంటుంది. బాగా దుమ్మూధూళితో కూడిన వాతావరణం ఉంటుంది. ఈనేపథ్యంలో లారీన్ పావెల్ జాబ్స్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె అలర్జీతో బాధపడుతున్నట్లు సమాచారం. గతంలో ఎన్నడూ ఇంత జనం రద్దీ ఉన్న ప్రాంతాలకు లారీన్ పావెల్ జాబ్స్ వెళ్లలేదు. తొలిసారిగా జనం రద్దీ ఉన్న ప్రదేశంలో ఉండటంతో ఆమెకు అలర్జీ సోకినట్లు తెలిసింది.
Also Read :Pregnancy In Space : అంతరిక్షంలో గర్భం దాల్చడం సాధ్యమా ? పుట్టే పిల్లలు ఎలా ఉంటారు ?
స్వల్ప అస్వస్థతకు గురైనా వివిధ పూజల్లో లారీన్ పావెల్ జాబ్స్(Steve Jobs Wife) పాల్గొన్నారని స్వామి కైలాసానంద గిరి వెల్లడించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ప్రయాగ్ రాజ్‌లోని త్రివేణి సంగమంలో లారీన్ పావెల్ జాబ్స్ పుణ్య స్నానం చేస్తారని చెప్పారు. జనవరి 29 వరకు ఆమె ప్రయాగ్ రాజ్‌లోనే ఉంటారని తొలుత వెల్లడించారు. అయితే ఆరోగ్య సమస్యలు వస్తున్నందున అప్పటివరకు లారీన్ పావెల్ జాబ్స్ ప్రయాగ్ రాజ్‌లో ఉంటారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది.
Also Read :Zuckerberg Vs Indian Govt : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు.. మెటాకు మోడీ సర్కారు సమన్లు
మహా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్‌కు వచ్చిన లారీన్ పావెల్ జాబ్స్ తన పేరును మార్చుకున్నారు. ఇప్పుడు ఆమె కొత్త పేరు కమల. ఈమేరకు ఆమెకు స్వామి కైలాసానంద గిరి గత శుక్రవారం రోజు (జనవరి 10న) నామకరణం చేశారు. భారత్‌లో లారీన్ పర్యటించడం ఇది రెండోసారి. గతంలో ఒకసారి ఆమె స్వామి కైలాసానంద గిరి ఆశ్రమానికి వచ్చారు. అప్పట్లో మెడిటేషన్ చేసేందుకు భారత్‌కు వచ్చారు. ఈసారి భారత పర్యటనకు రాగానే లారీన్ పావెల్ నేరుగా కాశీకి వెళ్లారు. అక్కడ కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభ మేళా విఘ్నాలు లేకుండా విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.