Online Betting : రాష్ట్రాలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌‌పై చట్టాలు చేయొచ్చు : కేంద్రం

తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్‌ సైట్లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు. ఈ ప్రశ్నకు వైష్ణవ్ నుంచి అంతే సూటిగా సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు లేదన్నారు.

Published By: HashtagU Telugu Desk
States can make laws on online betting: Center

States can make laws on online betting: Center

Online Betting : కేంద్రప్రభుత్వం ఇటీవల ఆన్‌లైన్ మనీ గేమింగ్ సంస్థల పై కొరడా ఝళిపించి విషయం తెలిసిందే. ఈక్రమంలోనే గేమింగ్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పై రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చని బుధవారం కేంద్రం వెల్లడించింది.ఇక తాజాగా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో మాట్లాడుతూ..అవి రాష్ట్ర పరిధిలోని అంశాలని వెల్లడించారు. వీటికట్టడి కేంద్రం కూడా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించిందని, దీనిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందా..? అని మారన్ ఘాటుగా ప్రశ్నించారు. నిషేధం విధించడానికి ప్రభుత్వానికి ఎంత సమయం కావాలని అడిగారు.

Read Also: Nithyananda : బొలీవియాలోని 4.80 లక్షల ఎకరాల్లో నిత్యానంద కలకలం

రాష్ట్రాల పరిధిలోని అంశమే అయినా.. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 1410 గేమింగ్‌ సైట్లను ఇప్పటికే నిషేధించామని వెల్లడించారు. ఈ ప్రశ్నకు వైష్ణవ్ నుంచి అంతే సూటిగా సమాధానం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఈ అంశంపై చట్టాలు రూపొందించేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక, చట్టబద్ధ అధికారాన్ని ఇచ్చిందని గుర్తుచేశారు. దయచేసి సమాఖ్య నిర్మాణాన్ని అర్ధం చేసుకోండి అని సూచనలు చేశారు. కాగా, అక్రమంగా నిర్వహిస్తోన్న వందల వెబ్‌సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డీజీజీఐ బ్లాక్ చేసింది. ఆ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంక్ ఖాతాలు సీజ్‌ చేసి, రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది.

ఐటీశాఖ సమన్వయంతో ఆ వెబ్‌సైట్‌లను బ్లాక్ చేశాం అని కేంద్రం తెలిపింది. అలాగే మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల అప్రమత్తం ఉండాలని, వాటిని ఎవరూ వాడొద్దని డీజీజీఐ హెచ్చరించింది. సంస్థలను నమోదు చేయకుండా, ఆదాయాలను దాచిపెడుతూ జీఎస్టీ ఎగవేతలకు పాల్పడుతోన్న చట్టవిరుద్ధమైన ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకున్నాం అని తెలిపింది. దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి అని హెచ్చరించింది.

Read Also:Bhadrachalam : కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఆరుగురు మృతి!

 

  Last Updated: 26 Mar 2025, 08:15 PM IST