SSC New Website : అభ్యర్థులూ SSC వెబ్‌సైట్ మారింది.. అది చేసుకోండి

SSC New Website : పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్టాఫ్​ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కీలక పాత్ర పోషిస్తుంటుంది.

  • Written By:
  • Publish Date - February 24, 2024 / 06:41 PM IST

SSC New Website : పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో స్టాఫ్​ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) కీలక పాత్ర పోషిస్తుంటుంది. తాజాగా ఎస్ఎస్‌సీ తన అధికారిక వెబ్​సైట్​ను మార్చేసింది. ప్రస్తుతమున్న https://ssc.nic.in/ యూఆర్​ఎల్​ను https://ssc.gov.in/ గా మార్చింది. ఈ కొత్త వెబ్​సైట్​ను​ ఫిబ్రవరి 17నే ప్రారంభించారు.  ఎస్ఎస్‌సీ కొత్త వెబ్​సైట్​లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్​ (ఓటీఆర్​) చేసుకోవడం తప్పనిసరి. వెబ్​సైట్​ పేరును మార్చిన నేపథ్యంలో అభ్యర్థులు అందరకూ కచ్చితంగా వన్​ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్​) చేసుకోవాలి. ఇకపై ఉద్యోగ ప్రకటనలు, పరీక్ష ఫలితాలు అన్నీ నూతన వెబ్‌సైట్‌లోనే ప్రచురితం అవుతాయని వెల్లడించింది. అందువల్ల రిజిస్ట్రేషన్​, ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఈ వెబ్​సైట్​లోనే(SSC New Website) చేసుకోవాలి.

We’re now on WhatsApp. Click to Join

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్​లో 100 పోస్టులు (గుంటూరు – 40, విజయవాడ – 30, విశాఖపట్నం – 30); తెలంగాణాలో 96 పోస్టులు (హైదరాబాద్ -58, వరంగల్​ – 38) ఉన్నాయి. ఆన్​లైన్ రిజిస్ట్రేషన్​కు ఆఖరు తేదీ మార్చి 6. ఆన్​లైన్ పరీక్ష తేదీ మార్చి 10.

ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్

యూపీఎస్​సీ 150 ఇండియన్​ ఫారెస్ట్​ సర్వీస్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసింది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 2024 మార్చి 5. ప్రిలిమినరీ పరీక్ష 2024 మే 26న నిర్వహిస్తారు.

Also Read : Income Tax – A Flat : నిర్మాణంలో ఉన్న ఫ్లాట్‌ కొంటున్నారా ? ఇవి తెలుసుకోండి

ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా

ఎయిర్​పోర్ట్స్​ అథారిటీ ఆఫ్ ఇండియా 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్​ డిగ్రీలు చేసినవారు ఈ పోస్టులకు అర్హులు. దరఖాస్తుల స్వీకరణ 2024 ఏప్రిల్​ 2న మొదలవుతుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ  మే 1.

పంజాబ్​ నేషనల్ బ్యాంక్

పంజాబ్​ నేషనల్ బ్యాంక్​ 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో క్రెడిట్ ఆఫీసర్, ఫారెక్స్ మేనేజర్​, సైబర్ సెక్యూరిటీ మేనేజర్​, సీనియర్ మేనేజర్​ మొదలైన పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల స్వీకరణకు ఆఖరు తేదీ ఫిబ్రవరి 25.  పరీక్ష తేదీ మార్చి/ ఏప్రిల్.

రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్

రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ (ఆర్​ఆర్​బీ) 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ మార్చి 9న మొదలవుతుంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ ఏప్రిల్​ 8.

Also Read : GO 317 : 317 జీవోపై మంత్రివర్గ సబ్ కమిటీ.. ఛైర్మన్‌గా దామోదర