SSC GD Recruitment 2024 : 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, కర్నూలు, తిరుపతిలలో పరీక్షా కేంద్రాలు(SSC GD Recruitment 2024) ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Ssc Gd Recruitment 2024 Notification

SSC GD Recruitment 2024 : పదో తరగతి పాసైన అభ్యర్థులకు గుడ్ న్యూస్. 39,481 కానిస్టేబుల్ (జీడీ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్​ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఎస్​ఎస్​సీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా అప్లికేషన్లను సమర్పించవచ్చు. పరీక్ష ఫీజును ఆన్​లైన్​లోనే పే చేయాలి. జనరల్​, ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100. మహిళలు, మాజీ సైనిక ఉద్యోగులు, ఎస్టీ, ఎస్సీలకు అప్లికేషన్ ఫీజు లేదు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబర్ 14. అప్లికేషన్ ఫామ్‌లను నవంబర్​ 5, 6, 7 తేదీల్లో ఎడిట్ చేసుకోవచ్చు. 2025 జనవరి/ ఫిబ్రవరిలో పరీక్షలు ఉంటాయి. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, కర్నూలు, తిరుపతిలలో పరీక్షా కేంద్రాలు(SSC GD Recruitment 2024) ఉన్నాయి.

Also Read :Electricity Saving Tips : మీ కరెంటు బిల్లు తగ్గాలా ? ఈ టిప్స్ ఫాలో కండి

  • అభ్యర్థులకు 2025 జనవరి లేదా ఫిబ్రవరిలో రాత పరీక్షలు జరుగుతాయి.
  • 160 మార్కులకు పరీక్ష జరుగుతుంది. 60 నిమిషాల్లో పరీక్ష రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌/ హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంటుంది.
  • అనంతరం ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్,  ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ జరుగుతుంది.
  • చివరగా వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది.
  • రిజర్వేషన్‌ల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
  • ఈ రిక్రూట్‌మెంటులో ఎంపికయ్యే వారికి బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అసోం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను కేటాయిస్తారు.

Also Read :China Halts Foreign Adoptions : విదేశీయులకు పిల్లల దత్తతపై చైనా సంచలన నిర్ణయం

  • ఈ ఉద్యోగానికి అప్లై చేసే పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ ఉండాలి. అంతకంటే హైట్ తగ్గకూడదు.
  • అభ్యర్థుల వయస్సు 18 నుంచి 23 ఏళ్లలోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు; ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.
  Last Updated: 07 Sep 2024, 03:07 PM IST