Site icon HashtagU Telugu

Visa Free Entry : ఇక వీసా లేకుండానే శ్రీలంకకు వెళ్లొచ్చు.. ఎలా ?

Visa Free Entry

Visa Free Entry

Visa Free Entry : శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారత్‌, చైనా, రష్యా, మలేసియా, జపాన్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాల టూరిస్టులకు వీసా లేకుండానే పర్యాటక ప్రదేశాల సందర్శనకు అనుమతి ఇవ్వాలని లంక నిర్ణయిచింది. ఈవిషయాన్ని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ అధికారికంగా వెల్లడించారు. ఇదొక పైలట్‌ ప్రాజెక్టు అని.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని ఆయన తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎందుకీ నిర్ణయం ?

శ్రీలంక ప్రధాన ఆదాయ వనరు టూరిజం. దీని ద్వారా లంకకు ఎంతో ఫారిన్ కరెన్సీ వస్తోంది. వచ్చే ఏడాది వ్యవధిలోగా 20 లక్షల మంది టూరిస్టులను తమ దేశానికి ఆకర్షించాలని లంక లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే వీసా లేకుండా దేశంలోకి టూరిస్టులకు ఎంట్రీ కల్పించాలనే నిర్ణయాన్ని తీసుకుంది. వీసా మినహాయింపు కల్పించిన దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆర్థిక సంక్షోభం టైంలో శ్రీలంకకు భారత్, చైనా ఎంతో సాయం చేశాయి. అందుకే ఈ రెండు దేశాలకు వీసా నుంచి మినహాయింపు కల్పించింది. శ్రీల‌ంక తీసుకున్న తాజా నిర్ణ‌యంతో 7 దేశాల‌కు చెందిన‌ ప‌ర్యాట‌కుల‌కు  వీసా ఖ‌ర్చు, స‌మ‌యం త‌గ్గ‌నుంది.