Site icon HashtagU Telugu

ISIS Terrorists : నలుగురు ఐసిస్ ఉగ్రవాదుల మాస్టర్ మైండ్ అరెస్ట్

Isis Terrorists

Isis Terrorists

ISIS Terrorists : ఈ ఏడాది మే 19న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శ్రీలంకకు చెందిన నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తాజాగా కొత్త విషయం వెలుగుచూసింది. ఈ నలుగురు ఐసిస్ ఉగ్రవాదులను మోటివేట్ చేసి.. ఉగ్రదాడి కోసం భారత్‌కు పంపిన హ్యాండ్లర్‌ను శ్రీలంక పోలీసు నిఘా విభాగం అరెస్టు చేసింది. 46 ఏళ్ల ఉగ్రవాది ఉస్మాన్ పుష్పరాజా గెరార్డ్‌ను కొలంబోలో అరెస్టు చేశామని శ్రీలంక పోలీసు మీడియా ప్రతినిధి వెల్లడించారు.  ఉస్మాన్ ఆచూకీ గురించి సమాచారం అందించిన వారికి రూ.20 లక్షలు అందిస్తామని ఇటీవలే లంక పోలీసులు ప్రకటించారు. ఎవరైనా సమాచారం అందిస్తే ఉస్మాన్‌ను అరెస్టు చేశారా ? పోలీసులే అతడిని ట్రేస్ చేశారా ? అనేది ఇంకా తెలియరాలేదు.

We’re now on WhatsApp. Click to Join

ఉగ్రవాది ఉస్మాన్ పుష్పరాజా గెరార్డ్‌ ఆదేశాల మేరకు.. నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు మే 19న కొలంబో నుంచి చెన్నైకి ఇండిగో విమానంలో వచ్చారు.  అక్కడి వారంతా కలిసి పేలుళ్లు జరిపేందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌‌కు  చేరుకున్నారు. అక్కడ ఆయుధాలను అందించే వ్యక్తి కోసం వారంతా ఎదురు చూస్తుండగా..  యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్)  పోలీసులు రంగ ప్రవేశం చేసి ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.

ఉగ్రవాదుల నేపథ్యం.. 

అరెస్టయిన వాళ్లలో 35 ఏళ్ల మహమ్మద్ నుస్రత్‌కు నేర చరిత్ర ఉంది. అతడు సింగపూర్, మలేషియా, దుబాయ్ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న టెలికమ్యూనికేషన్ పరికరాలు, ఎలక్ట్రికల్ పరికరాలను శ్రీలంకలో విక్రయించేవాడు.  2020 సెప్టెంబరులో కొలంబోలోని మహమ్మద్ నుస్రత్‌ నివాసంపై పోలీసులు రైడ్ చేయగా హెరాయిన్‌ లభించింది.  అరెస్టయిన మరో వ్యక్తి పేరు 27 ఏళ్ల మహ్మద్ నఫ్రాన్. ఇతడు ఇండియా, దుబాయ్ నుంచి శ్రీలంకకు అక్రమంగా దుస్తులు, చాక్లెట్‌లను దిగుమతి చేసుకునే వ్యాపారం చేసేవాడు.  2017లో నేషనల్ జెమ్ అండ్ జువెలరీ అథారిటీ యాక్ట్ కింద నఫ్రాన్‌ను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీలంకకు చెందిన అండర్ వరల్డ్ డ్రగ్ వ్యాపారి మొహమ్మద్ నియాస్ నౌఫర్ అలియాస్ ‘పొట్టా నౌఫర్’ కుమారుడే ఈ  మహ్మద్ నఫ్రాన్. గతంలో కొలంబోలో ఒక హైకోర్టు న్యాయమూర్తిని హత్య చేసిన కేసులో ప్రస్తుతం ‘పొట్టా నౌఫర్’ జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.  ఇక మరో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు(ISIS Terrorists) కొలంబోకు చెందిన మహ్మద్ ఫారిస్, మొహమ్మద్ రష్దీన్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి  అని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది.

Also Read : Driving License : నేటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్

Exit mobile version