Site icon HashtagU Telugu

SpiceJet: స్పైస్‌జెట్ విమానంలో గొడవ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Spicejet

Resizeimagesize (1280 X 720) 11zon

స్పైస్‌జెట్ విమానం (SpiceJet Plane)లో క్యాబిన్ సిబ్బందితో ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించాడు. దీని తరువాత ఎయిర్ హోస్టెస్‌తో అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడి, అతని సహ ప్రయాణికుడిని డిబోర్డ్ చేసి భద్రతా బృందానికి అప్పగించారు. జనవరి 23న ఢిల్లీ-హైదరాబాద్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ సోమవారం (జనవరి 23) తెలిపింది.

ఢిల్లీలో బోర్డింగ్ సమయంలో ఓ ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బందిని వేధిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనపై క్యాబిన్ సిబ్బంది పీఐసీకి, సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారని స్పైస్‌జెట్ తెలిపింది. కలిసి ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు, సహ ప్రయాణికుడిని ఆఫ్‌లోడ్ చేసి భద్రతా బృందానికి అప్పగించారు. తాజాగా విమాన ప్రయాణంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి.

అంతకుముందు జనవరి 5న, న్యూఢిల్లీ నుంచి గోవాకు వెళ్తున్న గోఫస్ట్ విమానంలో ఇద్దరు విదేశీ ప్రయాణికులు మహిళా ఫ్లైట్ అటెండెంట్‌తో అనుచితంగా ప్రవర్తించారు. విదేశీ ప్రయాణికులు ఒక ఎయిర్ హోస్టెస్‌ని తమతో పాటు కూర్చోమని కోరారని, మరో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపించారు. ప్రయాణికులిద్దరినీ ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ ఏజెన్సీ సీఐఎస్‌ఎఫ్‌కు అప్పగించగా, విషయాన్ని రెగ్యులేటర్ డీజీసీఏకు నివేదించారు.

దీంతో పాటు ఎయిరిండియా విమానంలో సహ ప్రయాణికురాలిపై ఓ ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటన కూడా తెరపైకి వచ్చింది. 2022 నవంబర్ 26న శంకర్ మిశ్రా అనే వ్యక్తి మద్యం మత్తులో బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న వృద్ధ మహిళపై మూత్ర విసర్జన చేశాడు. కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుడిని బెంగళూరులో అరెస్టు చేశారు.