Site icon HashtagU Telugu

1400 Jobs Cut : స్పైస్​జెట్​లో 1400 జాబ్స్ కట్.. కారణం అదే ?

Boeing Lost

spicejet

1400 Jobs Cut : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ స్పైస్​జెట్​ త్వరలో 1400 మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోంది.  సంస్థ ఖర్చులను తగ్గించుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఎయిర్​క్రాఫ్ట్ ఫ్లీట్​ ఖర్చులను తగ్గించడానికి, సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికే ఉద్యోగ కోతల దిశగా స్పైస్​జెట్ అడుగులు వేస్తోంది.  ​‘‘స్పైస్​జెట్​ ఇప్పటికే అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. చట్టపరమైన పోరాటాలు చేస్తోంది. అందుకే సంస్థలో ఉన్న అదనపు సిబ్బందిని తొలగించి, కొంత మేరకు ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ వారం చివరి నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది’’ అని స్పైస్​జెట్​ అధికారి ఒకరు ప్రకటించారు.  ‘‘ప్రస్తుతం స్పైస్​జెట్‌లో 9000 మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో 10 నుంచి 15 శాతం మందిని తొలగించే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే సంస్థకు ఏడాదికి రూ.100 కోట్ల వరకు ఆదా అవుతుంది’’ అని చెప్పారు. ‘‘స్పైస్​జెట్ దాదాపు అన్ని శాఖల్లోనూ అదనంగా ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు(1400 Jobs Cut) సిద్ధమవుతోంది. ఇప్పటికే మేనేజ్​మెంట్, కన్సల్టెన్సీ సిబ్బంది సంస్థలో అదనంగా ఉన్న ఉద్యోగుల జాబితాను తయారు చేస్తున్నారు’’  అని మరో అధికారి పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join

Also Read : Lightning Strike : ఫుట్‌బాలర్‌పై పిడుగు.. గ్రౌండ్‌లోనే చనిపోయిన ప్లేయర్