Ayodhya Train : గుజరాత్‌లోని సూరత్ నుంచి అయోధ్యకు బయలుదేరిన ఆస్థా ప్రత్యేక రైలుపై ఆదివారం రాత్రి రాళ్లదాడి జరిగింది. సూరత్ రైల్వే స్టేషన్ నుంచి 1340 మంది ప్రయాణికులతో ట్రైన్ బయలుదేరిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి దర్శన జర్దోష్ ఈ ప్రత్యేక రైలుకు సూరత్ స్టేషన్‌లో జెండా ఊపి ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join
ఆదివారం రాత్రి 11:15 గంటలకు అయోధ్య ప్రత్యేక రైలు(Ayodhya Train) మహారాష్ట్రలోని నందుర్‌బార్‌కు చేరుకోగానే.. కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వారు. రైలు ఆగిన వెంటనే బయటి నుంచి రైలుపైకి కొందరు రాళ్లు రువ్వారని ప్రయాణికులు తెలిపారు. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై తలుపులు, కిటికీలకు తాళాలు వేశారు. అయితే అప్పటికీ దాదాపు డజను రాళ్లు రైలు లోపలికి వచ్చి పడ్డాయి. తలుపులు, కిటికీలు మూసేసిన తర్వాత కూడా గుర్తు తెలియని దుండగులు రాళ్లు విసరడం కంటిన్యూ చేశారని ప్రయాణికులు చెప్పారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విచారణ అనంతరం రైలు జర్నీని తిరిగి ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ రైలులో ఎక్కువమంది విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు, సూరత్ కార్మికులే ఉన్నారని చెప్పారు.
Also Read : Centre vs Southern States : కేంద్రం వర్సెస్ దక్షిణాది రాష్ట్రాలు.. నిధుల కేటాయింపుపై పోరు షురూ
బాబ్రీ మసీదుకు బదులుగా అయోధ్యకు 25 కిలోమీటర్ల దూరంలోని ధన్నీపూర్‌లో ముస్లింల కోసం కొత్త మసీదు నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మసీదు నిర్మాణానికి సుప్రీంకోర్టు ఐదు ఎకరాల భూమిని కేటాయించింది. మసీదు నిర్మాణంలో ఉపయోగించే మినార్, పవిత్రమైన ఇటుకలను ఇప్పటికే రెడీ చేశారని సమాచారం. వాటిని సౌదీ అరేబియాలోని మక్కాలో ఉండే జంజం పవిత్ర జలాల్లో శుద్ధి చేసి ఇండియాకు తీసుకొచ్చారని తెలుస్తోంది. ఏప్రిల్ నాటికి ఆ రెండింటిని అయోధ్యకు తరలించనున్నారు. మసీదు నిర్మాణానికి వాడే మొదటి ఇటుకపై పవిత్ర ఖురాన్ శ్లోకాలు, ఇస్లాం మత ప్రవక్త పేరులను బంగారపు పూతతో అలంకరించినట్లు చెబుతున్నారు. ధన్నీపూర్‌లో దాదాపు 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మసీదును నిర్మించనున్నారు.