Site icon HashtagU Telugu

Sonu Sood: రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రకటించిన సోనూసూద్

సోనూసూద్ ఈ పేరు తెలియని వారు ఉండరనే చెప్పొచ్చు. కరోనా, లాక్ డౌన్ సమయంలో తాను చేసిన సహాయ కార్యక్రమాలు చూసి తాను రాజకీయాల్లోకి రావాలని అయన అభిమానులు ఆశించారు.

గత కొన్ని రోజులుగా సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తారనిప్రచారం జరుగుతోంది. పలుమార్లు ఈ విషయం సోనూను అడగగా,
తనకు అలాంటి ఆలోచనలు లేవని కొట్టిపారేశారు.

తాజాగా రాజకీయాల్లోకి రానున్నట్లు సోనూ సూద్ ప్రకటించారు. అయితే అది తన సోదరి కోసం చేసిన ప్రకటన.
తన సోదరి మాల్విక సూద్ సచార్ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు సోనూ తెలిపారు. పంజాబ్ నుండి ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారని సోనూ తెలిపారు. తన సోదరి మాల్విక రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉందని, ప్రజాసేవలో తన అసమానమైన కృషిని ఇచ్చేందుకు ఆమె కృతనిశ్చయంతో ఉందని, అయితే ఏ పార్టీలో చేరేది త్వరలో చెప్తామని సోనూ చెప్పారు.

Also Read:  గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్. 26 మంది మావోయిస్టులు హతం, మృతుల్లో కేంద్ర కమిటీ

ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీని సోనూసూద్ కలుసుకున్నారు. దీంతో మాల్విక కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు అందరు చర్చించుకుంటున్నారు.

సోను తన సోదరి రాజకియ అరంగేట్రం గురించి స్వయంగా ప్రకటించారు కాబట్టి అయన కూడా రాజకీయాల్లోకి త్వరగానే వచ్చే అవకాశముంది.అయన తమ పార్టీలోకి వస్తే హెల్ప్ అవుద్దని పలు పార్టీలు ఆశిస్తున్నారు. మరి సోనూ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Also Read: ఆర్యన్ ఖాన్ అరెస్ట్ పై అంతర్జాతీయ మీడియాతో మాట్లాడటానికి నిరాకరించిన షారుఖ్

Exit mobile version