Sonia Gandhi: రాజస్థాన్ బరిలో సోనియా గాంధీ

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె జైపూర్‌కు వెళ్లనున్నారని, నామినేషన్ పత్రాల దాఖలుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే

Sonia Gandhi: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజస్థాన్‌ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె జైపూర్‌కు వెళ్లనున్నారని, నామినేషన్ పత్రాల దాఖలుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఆమె వెంట వచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. సోనియా గాంధీ బుధవారం రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ కాగా, ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.విశేషం ఏంటంటే సోనియా గాంధీకి ఇవే చివరి లోక్‌సభ ఎన్నికలని గతంలోనే ప్రకటించారు.

సోనియా గాంధీ రాయ్‌బరేలీ రేసు నుండి వైదొలగడంతో ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ స్థానం నుండి లేదా గతంలో రాహుల్ గాంధీ సారథ్యం వహించిన అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే దానిపై పార్టీ అధిష్టానం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో తొలిసారిగా ఎన్నికైన తర్వాత ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.

Also Read: Kodi Pulav Recipe: కోడి పలావ్ ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని మరీ తినేయాల్సిందే?