Site icon HashtagU Telugu

Sonia Gandhi To Lead Opposition : విపక్ష కూటమి ఛైర్ పర్సన్ గా సోనియా గాంధీ.. ఇవాళ మీటింగ్ లో చర్చించే అంశాలివే

Sonia Gandhi To Lead Opposition

Sonia Gandhi To Lead Opposition

Sonia Gandhi To Lead Opposition : ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటు దిశగా బెంగళూరులో జరిగిన మొదటి రోజు (సోమవారం) మీటింగ్ సక్సెస్ అయింది. 

ఇందులో విపక్షాల ఐక్యతా భావం స్పష్టంగా కనిపించింది.

జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన విపక్షాల మీటింగ్ కు.. సోమవారం జరిగిన విపక్షాల మీటింగ్ లో ఉన్న పెద్ద మార్పు ఏమిటి అంటే.. ఐక్యత !! 

ఒక అడుగు వెనక్కి తగ్గి కేంద్రం ఆర్డినెన్స్ పై పోరాటంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీపై విపక్షాల నమ్మకం మరింత పెరిగింది.

సోనియా గాంధీ చొరవచూపి ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ కూటమిని ఓడించాలనే కాంగ్రెస్ కృత నిశ్చయానికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.

అందుకే గతంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) కూటమికి చైర్ పర్సన్ గా వ్యవహరించిన అనుభవం ఉన్న సోనియా గాంధీనే మళ్ళీ విపక్ష కూటమి చైర్ పర్సన్ గా(Sonia Gandhi To Lead Opposition)   చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

Also read : Monsoon Session: 23 రోజుల పాటు కొనసాగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..!

కూటమి కన్వీనర్‌గా నితీష్ కుమార్

సోనియాగాంధీ సారధ్యానికి దాదాపు అన్ని విపక్ష పార్టీలు సమ్మతి తెలిపే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. దేశవ్యాప్తంగా కూటమికి మంచి రీచ్ లభించేందుకు సోనియా గాంధీ చరిష్మా పనికి వస్తుందని చెబుతున్నాయి.  ఇక పాట్నాలో విపక్షాల మొదటి సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూటమి కన్వీనర్‌గా నియమించనున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై ఈరోజు మీటింగ్ వేదికగా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీల కూటమికి  గతంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) అనే పేరు ఉండేది. ఈ పేరును మారుస్తారని తెలుస్తోంది.

Also read : 4 Childerns Injured : బెంగాల్‌లో సాకెట్ బాంబ్ పేలుడు.. న‌లుగురు చిన్నారులకు గాయాలు

విపక్ష కూటమికి పేరు డిసైడ్ అయ్యేది ఈరోజే

విపక్ష కూటమికి మంచిపేరును సూచించాల్సిందిగా అన్ని పార్టీలను సోమవారం కోరారు. అయితే ఆ పేరులో ‘ఇండియా’ అనే పదం ఉండేలా చూడాలని  సూచించారు. విపక్ష కూటమి పేరు కింద “యునైటెడ్ వి స్టాండ్” అనే ట్యాగ్ లైన్ ఉంటుందని తెలిసింది. కూటమి పేరుపై కూడా ఈరోజు క్లారిటీ రావచ్చని సమాచారం. విపక్ష పార్టీల ఉమ్మడి  ఎన్నికల ఎజెండా “కామన్ మినిమమ్ ప్రోగ్రామ్” కోసం సూచనలను ఆహ్వానించారు. అయితే ఇందులో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో  కేటగిరిని పొందుపర్చనున్నారు. “కామన్ మినిమమ్ ప్రోగ్రామ్”ను కూడా ఒకే పదంలో పలికేలా కొత్త పేరును పెడితే బాగుంటుందని  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ  సూచించారు. ఈరోజు జరిగే మీటింగ్ లో రాష్ట్రాలవారీగా సీట్ల పంపకంపై రోడ్‌మ్యాప్‌ ఫార్ములాను డిసైడ్ చేయనున్నారు.  విపక్ష కూటమికి ఉమ్మడి ఆఫీసును ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. కీలకమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (EVM)పై చర్చించడం, వాటిపై ఎన్నికల కమిషన్‌కు సంస్కరణలను సూచించడంపై కూడా ఇవాళ విపక్ష పార్టీలు డిస్కస్ చేయనున్నాయి.