PM Modi : కేరళలో తిరువనంతపురం సమీపంలో రూ.8,900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన విఝింజమ్ ఇంటర్నేషనల్ డీప్‌వాటర్ మల్టీపర్పస్ సీపోర్టును ప్రధాని మోడీ ఈరోజు ప్రారంభించారు. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ప్రతిపక్ష పార్టీపై వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. ఈ సందేశం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లిపోయింది అని మోడీ పరోక్షంగా కాంగ్రెస్ ను చమత్కరించారు. ఈ సీపోర్ట్‌తో కేరళలో ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యం, షిప్పింగ్‌లో భారత పాత్రను గణనీయంగా మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Kaleshwaram: కాళేశ్వరం మానవ నిర్మిత ‘భారీ విపత్తు’?
కాగా, కాంగ్రెస్ అధినాయత్వంతో శశిథరూర్ బంధం బీటలు వారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల వేళ ఆయన మోడీతో వేదిక పంచుకోవడం చర్చనీయాంశమైంది. గత కొన్ని నెలలుగా థరూర్ తన సొంత పార్టీపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య ఓ కేంద్ర మంత్రితో ఆయన సెల్ఫీ దిగడంతో థరూర్ పార్టీ మారనున్నట్లు ప్రచారం మొదలైంది. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తదితరులు పాల్గొన్నారు.
ఇక, గురువారం రాత్రి కేరళ చేరుకున్న ప్రధానిని థరూర్ వ్యక్తిగతంగా వెళ్లి స్వాగతించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ.. సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా. నా నియోజకవర్గానికి వచ్చిన ప్రధాని మోడీని సాదరంగా స్వాగతించా అని థరూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read Also: Iron Sculptures : అమరావతి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా ‘ఐరన్’ శిల్పాలు