Site icon HashtagU Telugu

Smoke In Train Toilet: రైలు టాయిలెట్‌లో అసాంఘిక కార్యకలాపాలు

Smoke In Train Toilet

Smoke In Train Toilet

Smoke In Train Toilet: భారతీయ రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఇటీవలి కాలంలో రిజర్వేషన్ కోచ్ లలో ఇతరులు ఏక్కి ఇబ్బందులు సృష్టించడం వెలుగు చూసింది. మరికొన్ని చోట్ల అయితే తోటి ప్రయాణికులు ఉన్నారన్న సోయి మరిచి ముద్దులతో రెచ్చిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. అయితే ఈ సమస్యలు ఉత్తరాదిన ఎక్కువగా జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే కొందరు ప్రయాణికులు మరో సవాల్ ని ఎదుర్కొంటున్నారు.

నార్త్ సెంట్రల్ రైల్వేలోని ఝాన్సీ సెక్షన్ గుండా వెళుతున్న రైలులో ప్రయాణీకుల టిక్కెట్లను టీటీఈ తనిఖీ చేస్తున్నాడు. అప్పుడు మూసి ఉన్న టాయిలెట్ నుంచి దుర్వాసన రావడం గమనించాడు. తలుపు తట్టి కాసేపు ఎదురుచూశాడు. తలుపు తీయగానే లోపల స్మోక్ జోన్ కనిపించింది. సాధారణంగా రైలులో ప్రయాణించే వారు పొగ తాగేందుకు డోర్ దగ్గరకు వెళ్లరు. రైలులో టాయిలెట్‌కి వెళ్లి పొగ తాగుతున్నారు. అక్కడికి వెళ్లి సిగరెట్ లేదా బీడీ వెలిగిస్తారు. ఇది సాటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగిస్తుంది.

We’re now on WhatsAppClick to Join

ఒక్క ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌లోనే 86 మంది, ఆగ్రా ఫోర్ట్ స్టేషన్‌లో 9 మంది, మధుర జంక్షన్‌లో 118 మంది, కోశికలన్ స్టేషన్‌లో 12 మంది, ఆగ్రా డివిజన్‌లోని ధోల్‌పూర్ రైల్వేస్టేషన్‌లో 3 మందిపై ఏప్రిల్ నెలలో కేసు నమోదైంది. ఇక గత నెలలోనే ఉత్తర భారతంలో 53 వేల మందిపై చర్యలు తీసుకోగా.. వారి నుంచి 3.52 కోట్ల రూపాయలు వసూలు చేశారు.

Also Read: Heat Wave: హీట్ వేవ్ తో మెంటల్ టెన్షన్.. ఈ టిప్స్ ఫాలోఅయ్యిపోండి!