Site icon HashtagU Telugu

Good News : ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్.. రూ.లక్ష వరకు పన్ను నోటీసులు విత్‌డ్రా

Good News

Good News

Good News : కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రూ.1 లక్ష వరకు ట్యాక్స్‌ను మోడీ సర్కారు మాఫీ చేసింది. అంటే.. బకాయి పడ్డ పాత పన్నులు గరిష్ఠంగా రూ. లక్ష దాకా మాఫీ అవుతాయి. దీంతో పెండింగ్ పన్ను బకాయిలు కలిగిన ఎంతోమంది చిన్నరేంజ్ కలిగిన పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది.  సాధారణంగా పన్ను బకాయిలు ఉంటే నెలకు 1 శాతం మేర ఐటీ శాఖ పెనాల్టీలు విధిస్తుంది. కానీ, ఇప్పుడు వడ్డీ, పెనాల్టీలను సైతం మాఫీ చేస్తుండడం పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరటగా(Good News) ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి బాకీ ఉన్న పాత పన్ను డిమాండ్లను చెల్లించడం, మాఫీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ)  వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

ఐటీ యాక్ట్ 1961లోని సెక్షన్ 220 (2) పాత పన్ను బకాయిలను చెల్లించడంలో ఆలస్యమైనప్పటికీ వాటిపై వడ్డీ లెక్కించాల్సిన అవసరం లేదని సీబీడీటీ తెలిపింది. ఈ ప్రాతిపదికనే ఓల్ట్ ట్యాక్స్ డిమాండ్ల గరిష్ఠ పరిమితి రూ.1 లక్షగా నిర్ధారించినట్లు తెలిపింది. పాత ట్యాక్స్ డిమాండ్లు ఉన్న వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు వెంటనే ఐటీఆర్ పోర్టల్‌లో చెక్ చేసుకోవాలని సీబీడీటీ సూచించింది. ITR పోర్టల్ లోకి వెళ్లిన తర్వాత ‘రెస్పాన్స్ టూ ఔట్‌ స్టాండింగ్ డిమాండ్స్’ అనే ట్యాబ్‌లో స్టేటస్‌ను చెక్ చేసుకోవాలని కోరింది. అయితే మాఫీ అయ్యే వాటిలోకి కొన్ని రకాల పన్ను డిమాండ్లు  మాత్రమే వస్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961, సంపద పన్ను చట్టం 1957, బహుమతి పన్ను చట్టం 1958 ప్రకారమున్న ట్యాక్స్ డిమాండ్లు.. ఐటీ యాక్ట్ 1961లోని పలు నిబంధనల ప్రకారం వడ్డీ, పెనాల్టీ, ఫీ, సెస్స్ లేదా సర్‌ఛార్జీలకు సంబంధించిన నోటీసులు దీని పరిధిలోకి వస్తాయి.

Also Read : Byjus Vacate : అద్దె కట్టలేక అతిపెద్ద ఆఫీస్ ఖాళీ చేసిన ‘బైజూస్’

పాత పన్ను డిమాండ్ల ఉపసంహరణకు సంబంధించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. 2015-16 మదింపు సంవత్సరం వరకున్న చిన్న పన్ను డిమాండ్ల ఉపసంహరణ కోసం ఒక్కో పన్ను చెల్లింపుదారునికి పరిమితిని లక్ష రూపాయలుగా నిర్దేశించింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన పథకం ప్రకారం ఈ మేరకు స్పష్టం చేసింది. 2010-11 మదింపు సంవత్సరం కోసం రూ.25,000 వరకున్న ట్యాక్స్‌ డిమాండ్లను, 2011-12 నుంచి 2015-16 మదింపు సంవత్సరాల కోసం రూ.10,000 వరకున్న ట్యాక్స్‌ డిమాండ్లను వెనక్కి తీసుకుంటామని ఈ నెల 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రకటన సందర్భంగా మంత్రి సీతారామన్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Exit mobile version