Skin Bank : భారత సైన్యానికి తొలిసారిగా స్కిన్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌లో ఏర్పాటు చేశారు. ఇందులో ప్లాస్టిక్ సర్జన్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం అందుబాటులో ఉంటారు. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు చర్మ సంబంధిత తీవ్ర గాయాలకు ఈ స్కిన్ బ్యాంకులో చికిత్సలు అందిస్తారు. చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్ బ్యాంకు హబ్‌గా పనిచేస్తుంది. అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు ఇది స్కిన్‌ను(Skin Bank) చేరవేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
- కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, తెగిన చేతులు, వేళ్లు అతికించడం వంటి చికిత్సలకు చర్మం అవసరం.
- చర్మ చికిత్సలు చేసేటప్పడు ప్రస్తుతానికి రోగి శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్ ద్వారా గాయాలైన చోట అమర్చుతున్నారు.
- అయితే ఈవిధంగా రోగి శరీరం నుంచి గరిష్ఠంగా 15 నుంచి 20 శాతం చర్మం మాత్రమే సేకరించగలం.
- అంతకంటే ఎక్కువ చర్మం అవసరమైనప్పుడు పనికొచ్చేలా స్కిన్ బ్యాంకును రెడీ చేశారు.
Also Read : Hajj Pilgrims : 550 మందికిపైగా హజ్ యాత్రికులు మృతి
ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి
సియాచిన్ మన దేశానిదే. ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధ భూమి. 1984 ఏప్రిల్ 13 నుంచి భారత సైన్యం అక్కడ ఎముకలు కొరికే చలి నడుమ పహారా కాస్తోంది. సియాచిన్‌కు సామాన్యులు అంత సులువుగా వెళ్లలేరు. చలికాలంలో అక్కడి ఉష్ణోగత్రలు -50 డిగ్రీలకు పడిపోతాయి. సియాచిన్‌లో భారత సైనికుల చిట్టచివరి క్యాంప్‌ని ‘ఇంద్ర కాల్’ అని పిలుస్తారు. బేస్ క్యాంప్ నుంచి అక్కడికి చేరుకోవడానికి సైనికులు 22 రోజుల పాటు నడవాల్సి ఉంటుంది. ఆ మంచులో, చలిలో ఒంటరిగా నడవడం ప్రమాదకరమే. మంచుగడ్డలు ఎప్పుడు కుంగిపోయి గోతులు ఏర్పడతాయో తెలియదు. అందుకే సైనికులంతా నడుముకు తాడు కట్టుకొని ఒకరి వెనక ఒకరు క్యూలో నడుస్తూ ఒక్కో చెక్ పోస్ట్‌కు చేరుకుంటారు.