Site icon HashtagU Telugu

6 Indians Died: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు భారతీయులు దుర్మరణం!

Crime

Crime

6 Indians Died: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాదేష్ ప్రావిన్స్‌లో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పర్వత మార్గంలో బోల్తా పడడంతో ఏడుగురు మృతి చెందారు. వీరిలో ఆరుగురు భారతీయ పౌరులేనని అక్కడి మీడియా వెల్లడించింది. బారా జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు గురువారం ఉదయం సిమారా సబ్ మెట్రోపాలిటన్ నగరంలోని చురియమై ఆలయానికి దక్షిణాన నది ఒడ్డున రోడ్డుపై బోల్తా పడింది. ఈ బస్సులో రాజస్థాన్‌కు చెందిన యాత్రికులు సహా 26 మంది ఉన్నారు. అయితే, ఈ ప్రమాదంలో ఆరుగురు భారతీయులు, ఒక నేపాలీ మరణించారు.

19 మంది గాయపడినట్లు ఖాట్మండు తెలిపింది. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ జిలామీ ఖాన్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు బారా జిల్లా పోలీసు అధికారి హోబీంద్ర బోగటి వెల్లడించారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు మరికొందరికి గాయాలయ్యాయని, వారికి చికిత్స అందించి అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.

మిగతా క్షతగాత్రులంతా వివిధ ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. నేపాల్‌లో రోడ్లు అధ్వానంగా ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. బుధవారం కూడా ప్రమాదం జరిగింది. బాగ్మతి ప్రావిన్స్‌లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో ఎనిమిది మంది మృతి చెందగా, 15 మందికి పైగా గాయపడ్డారు.

Also Read: TS High Court: బీఆర్ఎస్ కు మరో షాక్.. హైకోర్టు అనర్హత వేటు, గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణ