Liquor Scam: మనీష్ సిసోడియాకు భారీ షాక్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. సిసోడియా రిమాండ్‌ను నవంబర్ 22 వరకు పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.

Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. సిసోడియా రిమాండ్‌ను నవంబర్ 22 వరకు పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. మద్యం కుంభకోణంలో డాక్యుమెంట్లను సరిచూసుకోవాలని నిందితుల తరఫు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది . ఈ కేసు తదుపరి దర్యాప్తును నవంబర్ 22కి సీబీఐ వాయిదా వేసింది. ఈ స్కాంలో సిసోడియా పాత్ర ఉందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 26న సీబీఐ అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి కస్టడీలోనే ఉన్నాడు.

మార్చి 9న మనీలాండరింగ్ కేసులో విచారించిన తర్వాత సిసోడియా పేరును సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ క్యాబినెట్‌కు సిసోడియా రాజీనామా చేశారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నవంబర్ 17, 2021న మద్యం స్కామ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. అయితే అవినీతి ఆరోపణల కారణంగా సెప్టెంబర్ 2022 చివరిలో దానిని రద్దు చేసింది. మద్యం టెండర్లలో అవినీతి జరిగిందని దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఆ తర్వాత దేశంలోని పలువురు కీలక నేతలు మద్యం కుంభకోణంలో అరెస్టయ్యారు. ఎఫ్‌ఐఆర్‌లో సిసోడియా పేరు చేర్చడాన్ని ఆప్ ఖండించింది . ఎలాంటి తప్పు చేయకుండా సిసోడియాను ఎందుకు అరెస్టు చేశారంటూ సీబీఐ అధికారులను ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలోని ప్రతిపక్ష నేతలు దర్యాప్తు సంస్థలను టార్గెట్ చేస్తున్నారని ఆప్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read: Konda Surekha: రాహుల్ గాంధీ ర్యాలీలో అపశ్రుతి, కొండా సురేఖకు గాయాలు