COVID-19: దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుదల.. ఒక్క రోజే 1,071 కొవిడ్‌ కేసులు

దేశంలో కొవిడ్‌ (COVID-19) కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారి కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

Published By: HashtagU Telugu Desk
Covid Fourth Wave Imresizer

Covid Fourth Wave Imresizer

దేశంలో కొవిడ్‌ (COVID-19) కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా ఒక్కరోజులోనే 1000కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా సోకిన వారి కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త గైడ్‌లైన్‌లో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. భౌతిక దూరం పాటించడం, మాస్క్‌ల వాడకం, చేతి పరిశుభ్రత, లక్షణాల నిర్వహణ (హైడ్రేషన్, యాంటీ పైరెటిక్స్, యాంటీ ట్రావేసివ్) పర్యవేక్షణ, వైద్యులతో టచ్‌లో ఉండటంతో పాటు ఆక్సిజన్‌ను పర్యవేక్షించాలని కోరారు.

ఇది కాకుండా, గైడ్‌లైన్‌లో చెప్పబడినది ఏమిటంటే.. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక జ్వరం లేదా విపరీతమైన దగ్గు ఉంటే.. ఇవన్నీ ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని పేర్కొన్నారు. అదే సమయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాని మార్గదర్శకాలలో యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధించింది.

Also Read: Hemoglobin Increase: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

ఇది కాకుండా, గైడ్‌లైన్‌లో హై-రిస్క్ పేషెంట్లు రెమ్‌డెసివిర్‌ను కూడా ఐదు రోజుల పాటు తీసుకోవాలని కోరారు. మొదటి రోజున 200 mg IV, తర్వాత 4 రోజులకు 100 mg IV తీసుకోవాలని కోరారు. భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రభుత్వ ఆందోళనను పెంచాయి. గత గురువారం మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. లేఖలో ఈ రాష్ట్రాలు కరోనా పరీక్షలు, ట్రాక్, చికిత్స, టీకాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

గత 24 గంటల్లో భారతదేశంలో 1071 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో ముగ్గురు చనిపోయారు. 129 రోజుల తర్వాత దేశంలో ఒక్కరోజులో 1000కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న రోగుల సంఖ్య 5915కి పెరిగింది. తాజాగా రాజస్థాన్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మరణించడంతో మృతుల సంఖ్య 5,30,802కు చేరింది.

  Last Updated: 20 Mar 2023, 07:24 AM IST