Do Dhaage Ram Ke Liye : ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’.. 108 అడుగుల బాహుబలి అగరుబత్తీ

Do Dhaage Ram Ke Liye : అయోధ్యలోని భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది.

  • Written By:
  • Updated On - December 23, 2023 / 02:09 PM IST

Do Dhaage Ram Ke Liye : అయోధ్యలోని భవ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది. ఈ తరుణంలో ఆలయానికి భక్తుల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని పుణెకు చెందిన భక్తులు శ్రీరాముడి కోసం పవిత్ర వస్త్రాన్ని నేస్తున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్​క్షేత్ర ట్రస్ట్, హెరిటేజ్ హ్యాండ్ వేరింగ్ రివైవల్ ఛారిటబుల్​ ట్రస్ట్​ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘దో ధాగే శ్రీరామ్ కే లియే’ కార్యక్రమానికి(Do Dhaage Ram Ke Liye) విశేష స్పందన లభిస్తోంది. వస్త్రాన్ని నేసేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్యూ కడుతున్నారు. పవిత్ర వస్త్రంపై శ్రీ రామనామాన్ని మగ్గం ద్వారా భక్తులు రాస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని విజిట్ చేసి.. అయోధ్య రామయ్య కోసం వస్త్రం నేశారు. శ్రీరాముడికి వస్త్రాన్ని నేసే అవకాశం దక్కడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నామని, తాము కచ్చితంగా రామ్ లల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్తామని భక్తులు అంటున్నారు. ఇక్కడ నేస్తున్న వస్త్రాన్ని పట్టుతో రూపొందించామని, దాన్ని వెండి జరీతో అలంకరించామని కార్యక్రమ నిర్వాహకులు వెల్లడించారు. ఈ  మొత్తం వస్త్రాన్ని నేసిన తర్వాత ఉత్తర​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ద్వారా అయోధ్యలోని రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్​కు అందించనున్నట్లు తెలిపారు.

Also Read: PM Modi-Shah Rukh : ప్రధాని మోడీ, షారుఖ్ ఖాన్‌ డూప్లికేట్ల సమావేశం.. ఫేక్ వీడియో వైరల్

అయోధ్య రామమందిరంలో జనవరి 22న కొలువుతీరనున్న రామయ్య సన్నిధిలో 108 అడుగుల పొడువున్న అగరుబత్తీని వెలిగించనున్నారు. ఈ అగరుబత్తీ బరువు 3500 కిలోలు. నాలుగు నెలల పాటు కష్టపడి .. రూ.5 లక్షల ఖర్చుతో ఈ అగరు బత్తీని గుజరాత్‌లోని వడోదర ప్రాంతానికి చెందిన విహాభాయ్ అనే భక్తుడు తయారు చేశాడు. విహాభాయ్ ఒక రైతు. ఈ అగరు బత్తీని ఒకసారి వెలిగిస్తే.. 45 రోజుల పాటు సువాసనలు వెదజల్లుతూనే ఉంటుందని విహాభాయ్ తెలిపాడు.