Five Kids : సిక్కులు ఐదుగురు పిల్లల్ని కనాలి.. బాబా హర్నామ్ సింగ్ కీలక సూచన

Five Kids : సిక్కులు బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉండటానికి తప్పనిసరిగా ఐదుగురు పిల్నల్ని కనాలని దామ్‌దామి తక్సల్‌ ఖల్సా సిక్కు సంస్థ చీఫ్ బాబా హర్నామ్ సింగ్ ఖల్సా సూచించారు.

  • Written By:
  • Updated On - May 9, 2024 / 06:05 PM IST

Five Kids : సిక్కులు బలమైన కుటుంబ బంధాలను కలిగి ఉండటానికి తప్పనిసరిగా ఐదుగురు పిల్నల్ని కనాలని దామ్‌దామి తక్సల్‌ ఖల్సా సిక్కు సంస్థ చీఫ్ బాబా హర్నామ్ సింగ్ ఖల్సా సూచించారు. ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న వారికి పిల్లలను పెంచడంలో దామ్‌దామి తక్సల్‌ సంస్థ సహాయం చేస్తుందని ఆయన తెలిపారు. అలాంటి వారికి తగిన ఆర్థిక సాయం అందిస్తుందని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join

సిక్కు దంపతులు పంజాబ్‌ను మతపరంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా బలోపేతం చేయడానికి కనీసం ఐదుగురు పిల్లలను కనాల్సిన అవసరం ఉందని బాబా హర్నామ్ సింగ్ ఖల్సా అన్నారు. సిక్కులతో పాటు పంజాబ్‌లో ఉంటున్న హిందువులు, ఇతర వర్గాల ప్రజలు కూడా ఐదుగురు పిల్లలను(Five Kids) కనాలని ఆయన సూచించారు. దీనివల్ల సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరు దోహదం చేయాలని పేర్కొన్నారు. దీనిపై పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాజ్ లాలీ గిల్  తీవ్రంగా స్పందించారు. మహిళలు పిల్లలను పుట్టించే యంత్రాలు అన్న విధంగా బాబా హర్నామ్ సింగ్ కామెంట్స్ ఉన్నాయని మండిపడ్డారు. కాగా, దామ్‌దామి తక్సల్‌ ఖల్సా అనేది ఒక సిక్కుమత ప్రచార సంస్థ. జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే కూడా ఒకసారి ఈ సంస్థకు నాయకత్వం వహించాడు. నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆదేశంతో 1984 జూన్ 6న గోల్డెన్ టెంపుల్‌లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్‌లో భింద్రన్‌వాలే మరణించారు. ఈ ఆపరేషన్‌లో గోల్డెన్ టెంపుల్ భారీ నష్టాన్ని చవిచూసింది.

Also Read :Campaign : తెలంగాణ లో జై కాంగ్రెస్..ఏపీలో జై బిజెపి ..వెంకీ ‘అయ్యో.. అయ్యో ..అయ్యయ్యో ‘

ఇటీవల ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విడుదల చేసిన  ఓ నివేదిక ప్రకారం..1950 నుంచి 2015 వరకు మన దేశంలో హిందూ జనాభా 7.8 శాతం తగ్గింది. ఇదే సమయంలో ముస్లిం జనాభా 43 శాతం మేర పెరిగింది. మనదేశంలో సిక్కు జనాభా కూడా స్వల్పంగా 1.24 శాతం నుంచి 1.58 శాతానికి పెరిగింది.

Also Read: Nagari : మూడు రోజుల్లో పోలింగ్..అయినాగానీ రోజా తీరు మారలేదు..