Bihar Budget 2025: ఎన్నికల ఏడాది ఎఫెక్ట్.. బడ్జెట్‌లో బిహార్‌పై వరాల జల్లు

మఖానా సాగును ప్రోత్సహించేందుకు మఖానా బోర్డు (Bihar Budget 2025)ఏర్పాటు.

Published By: HashtagU Telugu Desk
Union Budget 2025 Bihar Elections Bihar Budget 2025 Nda Congress Andhra Pradesh

Bihar Budget 2025:  ఎన్నికల ఏడాది కావడంతో బిహార్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్‌లో పంట పండింది. ఆ రాష్ట్రానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. పలు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. ఇక ఇదే సమయంలో ఎన్‌డీఏ కూటమిలో కీలకంగా ఉన్న పలు రాష్ట్రాలకు మాత్రం అంతగా నిధులు, ప్రాజెక్టులు దక్కలేదు. ఈ బడ్జెట్‌ బిహార్‌కు బొనాంజా ఇచ్చినట్టుగా కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ఎన్‌డీఏ కూటమికి మరో పునాది లాంటి ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాన్ని మరీ దారుణంగా విస్మరించారని ఆయన మండిపడ్డారు.

Also Read :Nirmala Sitharaman Speech : ఆర్థిక మంత్రి నిర్మల బడ్జెట్‌ ప్రసంగాల రికార్డుల చిట్టా

బిహార్‌‌కు ఏం ఇచ్చారు ?

  • మఖానా సాగును ప్రోత్సహించేందుకు మఖానా బోర్డు (Bihar Budget 2025)ఏర్పాటు. బిహార్‌లో భారీ విస్తీర్ణంలో మఖానా సాగు జరుగుతుంటుంది. రైతులను ఆకట్టుకునేందుకు ఈ ప్రకటన చేశారు.
  • పశ్చిమ కోశీ కెనాల్ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు. ఈ ప్రాజెక్టు పరిధిలో మిథిలాంచల్ ప్రాంతంలో దాదాపు 50వేల హెక్టార్ల సాగుభూమి ఉంది. ఆయా ప్రాంతాల అన్నదాతలను టార్గెట్‌ చేసుకొని ఈ ప్రాజెక్టుకు ఫండింగ్ ఇస్తామని ప్రకటించారు.
  • బిహార్ యువతను ఆకట్టుకునేందుకుగానూ ఐఐటీ పాట్నా విస్తరణకు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
  • బిహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ స్థాయి కలిగిన సంస్థ ఏర్పాటు ద్వారా బిహార్‌కు ఎన్‌డీఏ ప్రాధాన్యత ఇస్తోందనే సంకేతాన్ని ప్రజల్లోకి పంపారు.
  • బిహార్‌ రాజధాని పాట్నా విమానాశ్రయ విస్తరణకు కేంద్ర బడ్జెట్‌లో పచ్చజెండా ఊపారు.

Also Read :Women Entrepreneurs : ఫస్ట్ టైం ఎస్సీ, ఎస్టీ మహిళా వ్యాపారవేత్తలకు నిర్మల శుభవార్త

బిహారీ చీరతో నిర్మల

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు  బిహార్‌కు చెందిన మధుబని కళారూపంతో కూడిన చీరను ధరించి పార్లమెంటుకు వచ్చారు. ఈ చీరపై చేపల ఆకారాల ప్రింట్స్ ఉన్నాయి. దీన్ని పద్మశ్రీ దులారీ దేవీ 2021 సంవత్సరంలో నిర్మలకు గిఫ్టుగా ఇచ్చారు. బిహార్‌లోని మధుబని జిల్లాకు నిర్మల వెళ్లగా ఈ చీరను బహూకరించారు.బడ్జెట్ ప్రసంగం చేసే సమయంలో దీన్ని ధరించాలని కోరారు. దులారీ దేవి కోరిక మేరకు బడ్జెట్ ప్రసంగం వేళ ఈ చీరను ధరించి నిర్మల పార్లమెంటుకు వచ్చారు.

  Last Updated: 01 Feb 2025, 04:34 PM IST