ShakthiSAT : ‘శక్తిశాట్’ మిషన్.. రెడీ అవుతోంది. ఇందులో భాగంగా ఏం చేయబోతున్నారో తెలుసా ? 108 దేశాలకు చెందిన 12వేల మంది హైస్కూలు బాలికలకు స్పేస్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఏరోస్పేస్ స్టార్టప్ ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ ఆధ్వర్యంలో ‘శక్తిశాట్’ మిషన్ అమలు కానుంది. 108 దేశాల బాలికలను ఏకతాటిపైకి తేవడం ద్వారా.. అంతరిక్ష పరిశోధనల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించాలని ఈ స్టార్టప్ లక్ష్యంగా పెట్టుకుంది. ‘శక్తిశాట్’ మిషన్ ద్వారా ఇస్రో ‘చంద్రయాన్-4’ ప్రాజెక్టులో ప్రయోగించేలా శాటిలైట్‌ను తయారు చేయాలని భావిస్తున్నట్లు ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ వెల్లడించింది. ఈ కార్యక్రమ పోస్టర్‌ను(ShakthiSAT) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము త్వరలో ఆవిష్కరించనున్నారు.
Also Read :Mallikarjun Kharge : ‘ముడా’ స్కాం ఎఫెక్ట్.. కర్ణాటక సర్కారుకు భూమిని తిరిగిచ్చేసిన ఖర్గే
శక్తిశాట్ మిషన్‌లో పాల్గొనే బాలికలకు స్పేస్ టెక్నాలజీ, పేలోడ్ తయారీ, స్పేస్ క్రాఫ్ట్ వ్యవస్థలపై ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో బ్రిటన్, యూఏఈ, బ్రెజిల్, కెన్యా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, గ్రీస్, శ్రీలంక తదితర దేశాల బాలికలు పాల్గొననున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తయ్యాక ప్రతి దేశం నుంచి ఒక బాలిక చొప్పున 108 మందిని ఎంపిక చేయనున్నారు. వారికి పేలోడ్‌లు, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొటోటైప్‌ల తయారీలో పూర్తిస్థాయి ట్రైనింగ్ ఇస్తారు.
Also Read :Alai Balai : తెలంగాణ సాధనలో ‘అలయ్ బలయ్’ పాత్ర కీలకం : సీఎం రేవంత్
‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ నిర్వహిస్తున్న శక్తిశాట్ మిషన్‌కు శ్రీమతి కేసన్ సారథ్యం వహిస్తున్నారు. తమ స్టార్టప్ ఇప్పటివరకు 18కిపైగా బెలూన్ శాటిలైట్లు, మూడు సబ్‌ఆర్బిటల్ పేలోడ్‌లు, నాలుగు ఆర్బిటల్ ఉపగ్రహాలను ప్రయోగించిందని ఆమె గుర్తు చేశారు. హైస్కూల్, కళాశాల విద్యార్థుల సాయంతో శాటిలైట్లను తయారుచేసి ప్రయోగించిన తొలి సంస్థగా తమకు పేరుందన్నారు. ‘చంద్రయాన్-4’ మిషన్ కోసం బాలికలతో శాటిలైట్ తయారు చేయించి, ప్రధాని మోడీ ఎదుట ప్రొటోటైప్‌ను ప్రదర్శించాలని భావిస్తున్నట్లు కేసన్ చెప్పారు.