Back to work : వర్క్ మోడ్ లోకి షారుఖ్.. త్వరలోనే కెమెరా ముందుకు!

షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్‌ గత రెండు నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. డ్రగ్స్ కారణంగా షారుక్ ఖాన్ ఫ్యామిలీ తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు.

  • Written By:
  • Updated On - November 19, 2021 / 12:47 AM IST

షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్‌ గత రెండు నెలలుగా చాలా ఇబ్బందులు పడ్డారు. డ్రగ్స్ కారణంగా షారుక్ ఖాన్ ఫ్యామిలీ తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురయ్యారు. అక్టోబర్ 2న ముంబై క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆర్యన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడిని అరెస్టు చేసి ఎన్‌సీబీ కస్టడీకి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈలోగా, ఆర్యన్ ఖాన్ బెయిల్ అభ్యర్థనను సెషన్స్ కోర్టు, ప్రత్యేక NDPS కోర్టు అనేకసార్లు తిరస్కరించింది, చివరకు అక్టోబర్ 28న బాంబే హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. పెండింగ్ పేపర్‌ వర్క్ కారణంగా బెయిల్ మంజూరైన రెండు రోజుల తర్వాత, అక్టోబర్ 30న ఆర్థర్ రోడ్ జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆర్యణ్ వ్యవహరంతో షారుఖ్ ఖాన్ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. సినిమా షూటింగ్స్, ఇతర ముఖ్య వ్యవహరాలన్నీ పెండింగ్ పెట్టాల్సి వచ్చింది.

అనేక మలుపుల తర్వాత ఆర్యన్ ఖాన్ జైలు నుంచి ఇంటికొచ్చాడు. దీంతో షారుఖ్ కాస్త రిలీఫ్ దొరికినట్టయింది. బ్యాక్ టు వర్క్ అంటూ మళ్లీ రోజువారి జీవితంలో బిజీబిజీగా గడుపునున్నాడు. సినిమా షూట్‌లు, స్టోరీస్ ఫైనల్ చేయడం, ఎండార్స్ మెంట్ చర్చలన్నీ డిసెంబర్ నుంచి  ప్రారంభించాలని SRK ఆలోచిస్తున్నట్లు ఖాన్ కుటుంబానికి సన్నిహితుడైన ఒక స్నేహితుడు మీడియాతో చెప్పారు.

ఆర్యన్ అరెస్టుకు ముందు షారుఖ్ ఖాన్ నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకుడిగా లయన్ (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌లో ఉన్నాడు. అంతేకాదు దీపికా పదుకొణెతో కలిసి పఠాన్ స్పెయిన్ షెడ్యూల్ కోసం కూడా బయలుదేరాడు. ఆర్యన్ అరెస్టుతో ఈ రెండు ప్రాజెక్టులు పెండింగ్‌లో పడ్డాయి. షారుక్ ఖాన్ ఆలస్యం చేయడంతో నిర్మాతలకు కొంతమేర నష్టం కలిగింది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంతవరకు షారుక్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్నాడు. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదట్లో షూటింగ్ తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది.