Mahayuti Tussle : మహారాష్ట్రలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో ఏదో జరుగుతోంది. బీజేపీ, షిండే వర్గం శివసేన, అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీలతో కూడిన ఈ సర్కారులో లుకలుకలు మొదలైనట్టు కనిపిస్తోంది. షిండే వర్గం శివసేనకు చెందిన 20 మంది అధికార ఎమ్మెల్యేల వై కేటగిరీ భద్రతను కుదించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. బీజేపీ, అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేలకు కూడా వై కేటగిరీ సెక్యూరిటీని తగ్గించనున్నారు. సెక్యూరిటీ కవర్‌ను కోల్పోనున్న షిండే వర్గం ఎమ్మెల్యేలతో పోలిస్తే.. బీజేపీ, అజిత్ పవార్ వర్గం ఎన్‌సీపీలకు చెందిన ఎమ్మెల్యేలు తక్కువ మందికే సెక్యూరిటీ కవర్‌ను తగ్గించనున్నారు. అందుకే ఏక్‌నాథ్‌షిండే గుర్రుగా ఉన్నారు. మహాయుతి కూటమి(Mahayuti Tussle)పై పట్టు కోసం బీజేపీ పాకులాడుతోందని షిండే వర్గం ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. కూటమిలో ఏర్పడిన లుకలుకల వల్లే ఇదంతా జరుగుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Grok 3 AI : ‘గ్రోక్ 3’ ఛాట్‌బోట్ వచ్చేసింది.. ఏమిటిది ?
రాజకీయాలు చేసే ఉద్దేశం ఉందా ?
మహారాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరుల దుర్వినియోగాన్ని ఆపేందుకే ఈ చర్యలన్నీ చేపడుతున్నామని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు చెబుతోంది. ఎమ్మెల్యేల సెక్యూరిటీ కోసం భారీగా నిధులను వెచ్చిస్తే, ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఎమ్మెల్యేల సెక్యూరిటీ విషయంలో రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదని అంటోంది. అయితే ఈ మాటలను నమ్మేందుకు షిండే వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా లేరు.
Also Read :Harish Rao: 11 ఏళ్ల కిందటి ఫొటోతో హరీశ్‌రావు ట్వీట్.. వివరాలివీ
2022లో అలా మొదలైంది..
2022 సంవత్సరంలో ఉద్ధవ్ థాక్రే శివసేన పార్టీ నుంచి ఏక్‌నాథ్ షిండే విడిపోయారు. దీంతో ఆనాటి మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కూలిపోయింది. ఆ టైంలో షిండే వర్గంలోకి జంప్ అయిన థాక్రే వర్గం శివసేన ఎమ్మెల్యేలకు భారీ భద్రతను కల్పించారు. నేరుగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి ఏక్‌నాథ్ షిండేకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించి, ఫిరాయింపులను ప్రోత్సహించింది. దీంతో మహారాష్ట్రలో అకస్మాత్తుగా మహాయుతి సర్కారు ఏర్పడింది.