Mount Everest Growth : ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్. ఇది సముద్ర మట్టానికి దాదాపు 8.85 కి.మీ ఎత్తు ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దీని ఎత్తు ఇంకా పెరుగుతోంది. 5 కోట్ల ఏళ్ల ప్రాచీనమైన ఈ పర్వతాల హైట్ ఇంకా పెరుగుతుండటంపై చాలాచోట్ల శాస్త్రవేత్తలు రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఎవరెస్ట్ హైట్ పెరిగేందుకు దోహదపడుతున్న అంశాలను తెలుసుకునే శాస్త్రపరమైన ప్రయత్నాలు చాలానే జరుగుతున్నాయి. ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్‌లోని చైనా యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్ శాస్త్రవేత్త జిన్ జెన్ దాయ్(Mount Everest Growth) కీలక వివరాలను వెల్లడించారు. ఈయన సారథ్యంలోని పరిశోధకుల టీమ్ ఎవరెస్టు హైట్ క్రమంగా పెరుగుతుండటంపై ఆసక్తికర సమాచారాన్ని సేకరించింది.
Also Read :Iran Vs Mossad : ‘‘మా గూఢచార సంస్థలో ఇజ్రాయెల్ ఏజెంట్లు’’.. ఇరాన్ మాజీ అధ్యక్షుడి సంచలన కామెంట్స్
అదేమిటంటే.. సమీపంలోని కోసీ, అరుణ్ నదీ వ్యవస్థల పరస్పర విలీన ప్రక్రియ వల్లే ఎవరెస్టు శిఖరం హైట్ పెరుగుతోందని వారు అధ్యయనంలో గుర్తించారు. కోసీ, అరుణ్ నదీ వ్యవస్థల విలీన ప్రక్రియ వల్ల ఎవరెస్టు శిఖరం ఎత్తు దాదాపు 49 ఫీట్ల నుంచి 164 ఫీట్ల దాకా పెరిగిందని చైనా శాస్త్రవేత్త జిన్ జెన్ దాయ్ తెలిపారు. ఈ నదులు ఒకదానితో మరొకటి విలీనం అవుతుండటం వల్ల ఏటా సగటున 0.01 నుంచి 0.02 ఇంచుల మేర ఎవరెస్టు శిఖరం ఎత్తు పెరుగుతోందని ఆయన చెప్పారు. దాదాపు గత 89వేల ఏళ్లుగా నిరంతరాయంగా కోసీ, అరుణ్ నదీ వ్యవస్థల విలీన ప్రక్రియ జరుగుతోందని విశ్లేషించారు.
Also Read :Religious Structures : రోడ్లను ఆక్రమించి నిర్మించిన మత కట్టడాలను తొలగించాలి : సుప్రీంకోర్టు
‘‘అరుణ్ నది తన ప్రవాహ మార్గాన్ని మార్చుకొని కొత్త మార్గంలో పయనిస్తోంది. ఈక్రమంలో తనతో పాటు రాళ్లు, రప్పలు, మట్టి, ఇసుక రాశులను ఎవరెస్టు వైపుగా మోసుకెళ్తోంది. వీటన్నింటిని బలంగా ఎవరెస్టు శిఖర తలం వైైపుగా నెడుతోంది. అందుకే ఎవరెస్టు శిఖరం దిగువ భాగం నుంచి క్రమంగా బలపడుతోందే తప్ప బలహీనపడటం లేదు. దీని ప్రభావం వల్ల దాని ఎగువ భాగం కూడా క్రమంగా పెరుగుతోంది’’ అని చైనా శాస్త్రవేత్త వివరించారు. ‘‘రాళ్లు, రప్పల వంటి బలమైన మెటీరియల్ ఏటా ఎవరెస్టులోకి చేరుతుండటం వల్ల దానిపై ఉన్న మంచు కరిగినప్పటికీ.. ఎత్తు మాత్రం అస్సలు తగ్గడం లేదు’’ అని ఆయన తెలిపారు. కాగా, ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘నేచర్ జియో సైన్స్’ జర్నల్‌లో పబ్లిష్ అయింది.