Supreme Court : గౌత‌మ్ అదానీ గ్రూప్‌ కంపెనీకి సుప్రీంకోర్టు భారీ షాక్‌

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 02:49 PM IST

 

Supreme Court: గౌత‌మ్ అదానీ గ్రూప్‌ కంపెనీ(Gautam Adani Group Company)కి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు(Supreme Court) భారీ షాకిచ్చింది. లేట్ పేమెంట్ స‌ర్‌చార్జ్ (ఎల్‌పీఎస్‌) డిమాండ్‌తో అదానీ ప‌వ‌ర్ ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించ‌డానికి న్యాయ‌స్థానం సోమ‌వారం నిరాక‌రించింది. అలాగే అదానీ కంపెనీకి రూ.50వేల జ‌రిమానా(50 thousand fine) కూడా వేసింది. స్ప‌ష్ట‌త కోసం దర‌ఖాస్తు చేసినందుకు గాను ఈ జ‌రిమానా విధించింది.

We’re now on WhatsApp. Click to Join.

జ‌స్టిస్ అనిరుద్ధ బోస్‌, జ‌స్టిస్ సంజ‌య్ కుమార్‌ల‌తో కూడిన డివిజ‌న్ బెంచ్ అదానీ గ్రూప్ కంపెనీ అదానీ ప‌వ‌ర్‌ను మొట్టికాయ వేస్తూ.. “ఎల్‌పీఎస్ కోసం వేర్వేరు ద‌ర‌ఖాస్తుల‌ను దాఖ‌లు చేయ‌డం అదానీ ప‌వ‌ర్ అవ‌లంభించిన స‌రైన చ‌ట్ట‌ప‌ర‌మైన మార్గం కాదు. మేము సుప్రీంకోర్టు లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీకి రూ.50వేలు చెల్లించి ద‌ర‌ఖాస్తు కొట్టివేస్తాం. అదానీ ప‌వ‌ర్ రాష్ట్ర డిస్కామ్ నుంచి ఎల్‌పీఎస్‌గా రూ.1,300 కోట్ల‌కు పైగా డిమాండ్ చేసింది. ఇది జైపూర్ విద్యుత్ విత్ర‌న్ నిగ‌మ్ లిమిటెడ్, రాజ‌స్థాన్ ప్రభుత్వానికి చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ కింద ఉంది. అదానీ ప‌వ‌ర్ రాజ‌స్థాన్ లిమిటెడ్ (ఏపీఆర్ఎల్‌) ద‌ర‌ఖాస్తు ద్వారా జైపూర్ విద్యుత్ విత్ర‌న్ నిగ‌మ్ లిమిటెడ్ నుంచి రూ.1376.35 కోట్ల అద‌న‌పు చెల్లింపును క్లెయిమ్ చేసింది. జ‌న‌వ‌రి 28న రాజ‌స్థాన్ డిస్కామ్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఎల్‌) ప్ర‌కారం ఆగ‌స్టు 2020లో తీసుకున్న నిర్ణ‌యం చ‌ట్టంలో మార్పు, బేరింగ్ కాస్ట్‌కు ప‌రిహారంపై ఆధార‌ప‌డి ఉంది” అని కూడా డివిజ‌న్ బెంచ్ వాదించింది.

read also: Modi Reaction on Kavitha Arrest : కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని మోడీ